ప్రతీ సినిమా ప్రదర్శనకు ముందు కచ్చితంగా జాతీయ గీతాలాపన ఉండాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అది కూడా జనగణమనకు ఎటువంటి మార్పులు లేకుండా.. యథాతథంగా ఉండాలని కూడా చెప్పింది కోర్టు. ఈ ఆదేశాలు చాలామందికి మింగుడుపడ్డం లేదు కానీ.. దీనిపై ఓపెన్ గా విమర్శలకు దిగాడు రామ్ గోపాల్ వర్మ.
'సినిమా హాల్స్ లో మాత్రమే జాతీయగీతాన్ని ఎందుకు పరిమితం చేయాలి? ఏదైనా షాప్ లోకి ప్రవేశించే ముందు.. కస్టమర్లను వీడియో చూసి లోపలకు రావాలని ప్రతీ షాప్ వాళ్లు ఎందుకు చెప్పకూడదు?' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ఈ దర్శకుడి నుంచి విమర్శలు సాధారణమే కానీ.. ఏకంగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కూడా కౌంటర్లు వేయడం అంటే.. ఆశ్చర్యకరమే.
అయితే.. వర్మ ఇక్కడ బాగా తెలివిగా ట్వీట్ చేశాడు. కోర్టు ఆదేశాలపై నేరుగా విమర్శిస్తే.. కోర్టు ధిక్కార నేరం అవుతుంది. అందుకే షాపులకు లింక్ చేసి ఏదో డౌట్ అడుగుతున్నట్లుగా ట్వీట్ పెట్టాడు. కానీ చెప్పాల్సిన పాయింట్ మాత్రం చెప్పేశాడుగా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/