సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆయన వెరైటీ విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పినా అందులో కొత్తదనం ఏమీ కనిపించదు. నలుగురితో నారాయణ..కులంతో గోవిందా? అన్న విధానానికి వర్మ ఎప్పటి నుంచో దూరమే. మారుతోన్న టెక్నాలజీకి తగ్గట్టు వర్మ మరింత అప్ డెటెడ్ వెర్షన్ గా ముందుకెళ్లిపోతుంటాడు.
తాజాగా మరోసారి హిందుసంప్రదాయాన్ని..అందులోనూ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఘనంగా జరుపుకునే ఉగాది పండుగను సైతం విడిచి పెట్టలేదు. ఉగాది పండుగ రోజుని కూడా టార్గెట్ చేసి తనదైన శైలిలో కామెంట్లు చేసారు. నూతన సంవత్సరాది ఉగాదితో ప్రారంభవం అవుతుందని తెలుగు ప్రేక్షకులు ఎంతో శుద్దితో ఉంటారు. చెడు వినకూడదు..చెడు చూడకూడదు..చెడు చేయకూడదని ముఖ్యంగా ఎక్కువగా విశ్వసిస్తారు.
సరిగ్గా ఉగాది రోజునే వర్మ ఆ మూడింటిని టార్గెట్ చేసి కనిపించాడు. వర్మ ఇద్దరి హీరోయిన్లని కుడి..ఎడమ చేతుల వైపు వేసుకుని ఇద్దరి భుజాలపై చేతులు వేసి మెడలో పొడవైన బంతిపూల మాల ధరించి రొమాంటిక్ మోడ్ లో కెమెరాకి ఫోజులిచ్చాడు. అంతటితో ఆగకుండా తనదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేసాడు. ``తెలుగు వారు సొంత సంస్కృతికి ద్రోహం చేస్తున్నారా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
ఉగాదిలో సంతోషం ఏంటో నాకు తెలియదు కాబట్టి నేను ఉగాది శుభాకాంకక్షలు చెప్పను. తెలుగు ప్రజలు ఉగాది కంటే నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇలా చేయడం ఉగాదికి ద్రోహం చేసినట్లు కాదా? జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నించాడు. వర్మ అన్న మాటల్లో కొన్ని నిజాలున్నాయి అనుకోండి. న్యూయర్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవద్దని అవధానులు.. తెలుగు భాషా పండితులు ఓవైపు అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా...అవి ప్రయత్నాలుగానే మిగిలిపోతున్నాయి. ఉగాదిని మించి న్యూ ఇయర్ వేడుకల్ని సెలబ్రేట్ చేస్తున్నారు.
దీనికి ఎన్నో కారణాలు ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి వాటిని పట్టుకునే వర్మ లాంటి వారు తెలుగు ఆడియన్స్ ని అలా టార్గెట్ చేస్తున్నారు. తద్వారా వర్మ లాంటి వారికి ఓ అవకాశం ఇచ్చిన వాళ్లు అవుతున్నారు. వర్మ ఏ పండుగని....ఏ వేడుకని సెలబ్రేట్ చేసుకోడు. విషోస్ చెప్పడు. అలాంటి రోజున మరింతగా ఫోకస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.
నిన్నటి పోస్ట్ అలాంటి ప్రయత్నం ఒకటని నెటి జనులు కామెంట్లు చేస్తున్నారు. ఎవరో కమెడీయన్ చెప్పినట్లు అన్ని సిటీలకన్నా పబ్లిసిటీ అంటే ఎక్కువ ఇష్టం అన్నట్లు. ప్రస్తుతం వర్మ నైనా గంగూలీ..అప్సర రాణి ప్రధాన పాత్రల్లో `మా ఇష్టం` అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు మహిళా లెస్బియన్ల మధ్య జరిగే అజరామార ప్రేమ కథ ఇది. ఇటవలే రిలీజ్ అయిన ట్రైలర్ ని వర్మ లిప్ లాక్ లతో నింపేసిన సంగతి తెలిసిందే. ఈ నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.