చిరంజీవినేంటి.. దేవుడినైనా వదలను

Update: 2016-12-22 17:03 GMT
రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ వంగవీటి రేపు రిలీజ్ కాబోతోంది. ఈ మధ్య కాలంలో వర్మ తీసిన ఏ మూవీకి లేనంత హైప్ ఈ చిత్రానికి దక్కుతోంది. కిల్లింగ్ వీరప్పన్ కు కూడా బజ్ క్రియేట్ అయినా.. తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఆసక్తి చూపలేకపోయింది.

కానీ వంగవీటి విషయంలో మాత్రం పాతికేళ్ల క్రితం లోకల్ పాలిటిక్స్ ను బేస్ చేసుకుని తీసిన సినిమా కావడం.. బెజవాడ రాజకీయాలు.. రెండు ప్రధాన కులాల మధ్య ఘర్షణలు కాన్సెప్ట్ కావడంతో.. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి సెన్సేషనే. ఇప్పుడా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వర్మ ఆసక్తికరమైన కామెంట్స్ బోలెడన్ని చేస్తున్నాడు. '

వంగవీటి రంగా హత్య జరిగినపుడు నేను దగ్గరలో లేను. కానీ దేవినేని గాంధీ మర్డర్ జరిగినపుడు 1500 గజాల దూరంలోనే ఉన్నా' అన్న వర్మ.. '26 ఏళ్ల చరిత్రను 2 గంటల్లో చూపించడం అసాధ్యమని నాకు తెలుసు. అయినా సరే అప్పుడేం జరిగిందో నిజం తెలియచెప్పాలని అనిపించినందుకే వంగవీటి తీశా'అంటున్నాడు.  'నా గత చిత్రాలతో వేటితోనూ వంగవీటిని పోల్చలేను. రక్తచరిత్రకు కమర్షియల్ హంగులు ఉంటే.. వంగవీటిలో వాస్తవాలకు దగ్గరగా తీశాను' అని చెప్పాడు వర్మ.

మెగా హీరోలపై విమర్శలు చేస్తుంటారనే ప్రశ్న వర్మకు ఎదురైనపుడు 'నేను ఓ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు రాస్తుంటాననే మాట అబద్ధం. నాకు ఆసక్తి కలిగించిన ప్రతీ అంశంపైనా స్పందిస్తాను. సుప్రీంకోర్టు నుంచి మోడీ వరకు.. డొనాల్డ్ ట్రంప్ నుంచి దేవుడి వరకూ.. ఏ విషయంలో అయినా నాకు అనిపించినది రాస్తుంటాను' అని చెప్పాడు వర్మ.
Tags:    

Similar News