గురూజీ.. ఇది రాంగ్‌ టైమింగ్‌

Update: 2016-02-03 22:30 GMT
ఇప్పటికే తన ''వంగవీటి'' సినిమాలో వంగవీటి రాధ క్యారెక్టర్‌ పోషించబోయే నటుడి గురించి రామ్‌ గోపాల్‌ వర్మ ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌ లో రాము తప్పు చేస్తున్నాడా అంటే.. సినిమా తీయడం ఆయన ఇష్టం కాని.. ఇది మాత్రం రాంగ్‌ టైమింగ్‌ అంటున్నారు సినిమా నిపుణులు.

''కమ్మ వారి మనస్తత్వం అర్ధం చేసుకునే తెలివున్న వారే అర్హత ఉన్న నిజమైన కాపులు'' అంటూ వంగవీటి రాధ చెప్పేవారని.. వంగవీటి రంగా.. తనతో చెప్పారు.. అంటూ రామ్‌ గోపాల్‌ వర్మ ఒక మాట విసిరాడు. బాగనే ఉంది. అసలు ఈ కులం ప్రతీక అర్ధం చేసుకోవడం ఎవ్వరికీ అర్దం కావట్లేదు మరి. సరే ఆ యాంగిల్‌ వదిలేద్దాం. కాని ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌ లో ఒక పక్కన కాపు కులస్తులు బిసిలో చేర్చాలంటూ ర్యాలీలు నిరసనలు దీక్షలు చేపట్టేశారు. అదే సమయంలో వారిని చేర్చకూడదంటూ బిసిలు పోరాటానికి సిద్దపడుతున్నారు. సేమ్‌ టైమ్‌ కొందరు కాపు లీడర్లు.. చంద్రబాబు 2015 ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ ద్వారా కాపులను ప్రలోభానికి గురి చేసి.. గెలిచాక కమ్మ వారి ప్రాబల్యం బాగా ఉన్న అమరావతిలో రాజధాని పెట్టించారని.. కాపులకు తీరని అన్యాయం చేశారంటూ విమర్శలు వినిపిస్తున్న వేళ.. ఇప్పుడు కమ్మ-కాపు గొడవలకు నిలువటద్దంలా ఉన్న వంగవీటి చరిత్రను తవ్వి తీసి వెండితెర మీద ఆరేయడం కరక్టేనా??

వర్మ ఆలోచన ఏదైనా కూడా.. ఈ టైమింగ్‌ మాత్రం రాంగే. ఏమంటారు గురూజీ? ట్వీటేసినంత ఈజీ కాదు.. మనోభావాలతో టెస్టు క్రికెట్‌ ఆడటమంటే!! పైగా ఈ సమయంలో వర్మ ఏమాత్రం ఇంబ్యాలెన్సుడ్‌ గా తీసినా గొడవలైపోతాయ్‌. ఒకవేళ సినిమాలో కాపు లీడర్లయిన రంగా, రాధాలను హీరోలుగా చూపించి.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన లీడర్లే వారిని హతమార్చారని చూపిస్తే.. కమ్మవారు గోల చేస్తారు. వారిని విలన్లుగా చూపించి రంగాపై ఏదైనా మరకలు వేస్తే.. కాపు సామాజిక వర్గం ఫీలవుతుంది. ఆలో''చించు'' వర్మ!!


Tags:    

Similar News