సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడేం చేస్తాడో.. ఎలా రియాక్ట్ అవుతారో అస్సలు అర్థం చేసుకోలేం. అంచనాలకు భిన్నంగా వ్యవహరించటం.. సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండటం ఆయనకు మామూలే. కొద్దికాలంగా సినిమా వాళ్ల మీద గతంలో మాదిరి ప్రముఖలపై తన మార్క్ విమర్శల్ని చేయటం లేదు.
భారీ అంచనాల మధ్య విడుదలైన బాలయ్య పైసా వసూల్ స్టంపర్ పై వర్మ రియాక్ట్ అయ్యారు. పూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్ర స్టంపర్ ఈ రోజు విడుదలైన కాసేపటికే వర్మ స్పందించారు. బాలయ్య లుక్ విషయంలో ఫ్రెష్ గా ఉండటం.. స్టంపర్ రిచ్ గా ఉండటంతో పాటు.. పూరీ మార్క్ స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. బాలయ్యను సరికొత్తగా చూపించిన పూరీని నందమూరి ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఇలాంటి జాబితాలో వర్మ కూడా తాజాగా చేరారు. స్టంపర్ ను చూసిన వర్మ.. సూపర్ డూపర్ అంటూ మెచ్చేసుకున్నారు. బాలకృష్ణను తొలిసారి ఇలాంటి లుక్ లో చూస్తున్నానని.. ఆయనెంతో బాగున్నారని.. ఎంతో ప్రేమిస్తున్నానంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టేశారు. వర్మ లాంటి క్రిటిక్.. పైసావసూల్ స్టంపర్ ను ఇంతలా పొగిడేయటం విశేషమనే చెప్పాలి.