రామ్ గోపాల్ వర్మ ఇప్పుడందరికీ కొత్తగా కనిపిస్తున్నాడు. డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ పరిశ్రమ తరఫున వకాల్తా పుచ్చుకుని సిట్ అధికారులపై ఆయన విమర్శలు గుప్పిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తన ప్రియ శిష్యుడు పూరి జగన్నాథ్ ను సిట్ అధికారులు 12 గంటలకు పైగా విచారించిన మరుసటి రోజే.. అకున్ సబర్వాల్ మీద వర్మ సెటైర్లు గుప్పించడం.. విచారణ తీరును తప్పుబట్టడం తెలిసిన సంగతే. ఇప్పుడు వర్మ ఓ కొత్త వాదనతో వచ్చాడు. ఇప్పుడు డ్రగ్స్ కేసును విచారిస్తున్న తీరుతో తెలంగాణ ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెడ్డ పేరు వచ్చేస్తోందట.. రాష్ట్రం పరువు పోతోందట. కాబట్టి జాగ్రత్త పడాలట. ఫేస్ బుక్ వేదికగా వర్మ ఇంకా ఏమేం అన్నాడో చూడండి.
‘‘ముంబయి జనాలు కేసీఆర్ ను ఎంతో ఆరాధిస్తారు. కానీ బాలీవుడ్లో కానీ.. ముంబయిలో కానీ.. పంజాబ్ పాఠశాలల్లో కానీ జరగనిది ఇప్పుడు టీఆర్ ఎస్ ప్రభుత్వంలో.. హైదరాబాద్ స్కూల్స్ లో జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన గర్వించే పౌరుడిగా అకున్ సబర్వాల్.. చంద్రవదన్ లాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులు దేశంలోని మిగతా ప్రాంతాల దృష్టిలో కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ట దెబ్బ తినకుండా చూడాలని కోరుకుంటున్నా. సిట్ బృందం ఈ వ్యవహారాన్ని సరైన మార్గంలో సరి చేస్తుందని ఆశిస్తున్నా.
చాలామంది సినిమా వాళ్లను అకున్ సబర్వాల్ నేతృత్వంలోని సిట్ బృందం విచారించడం ద్వారా ఏమీ తేలదని అంటున్నారు. ఐతే అంతిమ ఫలితం ఏం వచ్చినా అది తెలంగాణ రాష్ట్రానికి చాలా చెడ్డ పేరు తీసుకురావడం ఖాయం. తెలంగాణ పంజాబ్ కంటే దారుణమని ముంబయి జనాలు అనుకుంటున్నారు. రాజమౌళి తెలుగు రాష్ట్రాల ప్రతిష్టను ఎంతగానో పెంచితే అకున్ సబర్వాల్.. ఆయన బృందం దాన్ని చాలా తక్కువ స్థాయికి తీసుకొచ్చేసిందని ముంబయి జనాలు అనుకుంటున్నారు’’ అని వర్మ ముగించాడు. వర్మ వ్యాఖ్యలు చూస్తుంటే ఎంత తప్పు జరిగినా పర్వాలేదు.. దాన్ని అలాగే కప్పెట్టేయాలి కానీ.. అన్ని విషయాలూ బయటికి తీసి మిగతా ప్రపంచం దృష్టిలో చెడు కావడం మంచిది కాదు అన్నట్లుగా ఉంది. ఇదేం వింత వాదనో!