కొద్దిమందిని కదిలించుకోకూడదు. వీలైనంత వరకూ దూరంగా ఉండాలి. కదిలించుకునే అవకాశం వచ్చినా.. పట్టించుకోనట్లుగా ఉంటే సరిపోతుంది. కానీ.. నాగబాబుకు అంత ఓపిక.. సహనం లేనట్లుంది. అప్పుడెప్పుడో యండమూరి వీరేంద్రనాధ్ ఒక వ్యక్తిత్వ తరగతి కోర్సులో రాంచరణ్ గురించి ఏదో తప్పుగా మాట్లాడారని.. సంబంధం లేని వేదిక మీద విరుచుకుపడటం ఏమిటి? ఆవేశానికి అర్థం పర్థం ఉండాలి. కానీ.. ఆ చిన్న లాజిక్ ను నాగబాబు మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. యండమూరితో పాటు రాంగోపాల్ వర్మను సైతం వదిలిపెట్టలేదు నాగబాబు.
తనదైన శైలిలో అడ్డదిడ్డంగా మొరటు మాటలతో వర్మను ఏసుకున్నారు. ఎంత కోపం ఉన్నా.. బహిరంగ సభ మీద ‘‘వాడు’’.. ‘‘వాడు.. ఆ అక్కుపక్షి’’ లాంటి తిట్లను ఓపెన్ గా తిట్టేశారు. అలా తిట్టేయటం ఎంత ఖరీదైనదన్న విషయం అర్థమయ్యేలా చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. తనను ఎవరు కదిలించుకున్నా.. ఎంతకైనా సిద్ధమే అన్నట్లుగావ్యవహరించే వర్మతో పెట్టుకునేటప్పుడు.. అంతే మొండిగా వ్యవహరించాలి.
కానీ.. నాగబాబు అలా చేయలేదు. ఖైదీ ఫంక్షన్ లో తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నాగబాబు కామ్ అయిపోయారు. నాగబాబు మాట్లాడిన కాసేపటికే చాలా సాత్వికంగా ట్వీట్లు చేసిన వర్మ.. మీకు.. మీ ఫ్యామిలీకి సారీ అన్న పావు గంటకే.. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారన్న వర్మ.. నాగబాబుపై ఏ స్థాయిలో విరుచుకుపడాలో.. ఆ స్థాయిలో అగ్గి ఫైర్ అయ్యారు.
ట్వీట్ల మీద ట్వీట్లు కురిపించి.. చివరకు అలిసిపోయారో.. నిద్ర వచ్చిందో కానీ.. గుడ్ నైట్ చెప్పేసి నిన్నటికి తన ట్వీట్ల వర్షాన్ని ఆపారు.కానీ.. ఈ రోజు ఉదయం నుంచి ఆయన మళ్లీ తన ట్వీట్ల జోరును షురూ చేశారు. మధ్యాహ్నం తర్వాత నుంచి ఒకటి తర్వాత ఒకటిగా ట్వీట్ చేసిన ఆయన.. నాగబాబుపై విరుచుకుపడ్డారు. అద్దాల గదిలో ఉన్న వారు ఎదుటి వారిపైన రాళ్లువేయకూడదన్న భగవద్గీత లోని విషయాన్ని.. ప్రస్తుత పరిస్థితి అర్థమయ్యేలా ట్వీట్ చేశారు. అక్కడితో ఆగని వర్మ.. డామన్ వెయాన్స్.. ప్రాంక్లిన్ ఫోర్ కొట్స్ ను కోట్ చేశారు.
చిరంజీవి కుటుంబంలో ఎన్నో పాజిటివ్స్ ఉన్నాయని.. దేవుడు చిరు ఫ్యామిలీలో పవన్.. చరణ్.. సాయి ధరమ్.. వరుణ్.. బన్నీ లాంటి పాజిటివ్స్ ను ఇచ్చి.. బ్యాలెన్స్ గా నాగబాబు గారిని కూడా ఇచ్చేశారంటూ తానేం చెప్పాలనుకున్నారో దాన్ని చెప్పేశారు. నిన్నటి ట్వీట్ల వ్యంగ్యాస్త్రాలు సరిపోనట్లు ఈ రోజు కంటిన్యూ చేసిన వర్మ.. తన జోరును మరెన్ని రోజులు కొనసాగిస్తారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/