తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ డిమాండ్స్‌ ఇవే

Update: 2015-11-11 04:30 GMT
తెలుగు సినీ పరిశ్రమ మంచి జోష్ లో ఉందని చెప్పుకోవడమే కానీ.. అనేక సమస్యలు ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్నాయి. వీటికి తగిన పరిష్కార మార్గాలు సినీ పెద్దల దగ్గరున్నా.. ఆచరణకు అనేక అనుమతులు కావాల్సి ఉంటుంది. అందుకే తమ కోరికలతో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ చిట్టా పంపింది టాలీవుడ్. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రామ్ మోహన్ రావు.. సినిమాటోగ్రఫీ మంత్రి తలసానిని కలిసి పరిస్థితి వివరించారు.

షూటింగ్ ల కోసం అనేక  విభాగాల అనుమతులకు బదులు సింగిల్ విండో ఏర్పాటు చేయాలని కోరారు. మండల కేంద్రాల్లో 200 సీట్ల కెపాసిటీ ఉండే మినీ థియేటర్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని అడిగారు. 75సీట్లుండే అతి చిన్న థియేటర్లకు పర్మిషన్ తోపాటు వినోదపు పన్ను రాయితీ కూడా కల్పించాలని అభ్యర్ధించారు.  ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా అన్ని టికెట్లకు ఆన్ లైన్ విక్రయాలకు అవకాశం కల్పించి, తప్పనిసరిగా నమోదు చేయించాలన్న కోరిక మరొకటి. శ్లాబ్ సిస్టంను తొలగించి, అమ్ముడైన టికెట్లకే వినోదపు పన్ను వసూలు చేసేలా విధానాలు మార్చాలని కోరుతోంది టాలీవుడ్.

అంతే కాదు.. పైరసీని అరికట్టేందుకు ఆన్ లైన్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నవారిపై జరిమానా విధించాలని ప్రతిపాదించారు. సినిమా రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం నిర్మాతకు ఉండాలన్నది వీరి మరో డిమాండ్. అలాగే నంది అవార్డులను తిరిగి అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను కోరనుంది టీఎస్ ఎఫ్సీసీ.
Tags:    

Similar News