సాధారణంగా హిట్టు మీదున్న దర్శకులతో పనిచేయడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు యంగ్ హీరోలు. అయితే కుర్రాడు రామ్ మాత్రం.. ఇప్పుడు హిట్టు లేదు ఫట్టు అనే ఈక్వేషన్ చూసుకోకుండా దర్శకులకు ఛాన్సులు ఇస్తున్నాడు.
బలుపు సినిమా యావరేజ్ గా ఆడటంతో.. గోపిచంద్ మలినేనికి ఒక సంవత్సరంపాటు అస్సలు ప్రాజెక్టులే దక్కలేదు. ఆ టైములో పండగ చేస్కో సినిమాను ఆఫర్ చేశాడు రామ్. ఆ తరువాత రభస సినిమా ఫ్లాపుతో ఖంగుతిన్న సంతోష్ శ్రీనివాస్ కు.. హైపర్ సినిమా ఛాన్సిచ్చాడు. ఇప్పుడు కరుణాకరన్ తనకు గతంలో ఫ్లాపిచ్చినప్పటికీ.. మనోడు క్రేజీ ఫీలింగ్ అనే సినిమాను ఇస్తున్నాడు. మొత్తానికి ఇలా ఫ్లాపుల్లో లేదా ఇబ్బందుల్లో ఉన్న డైరక్టర్లందరికీ రామ్ ఆఫర్లు బాగానే ఇస్తున్నాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉన్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఫిలిం ఇండస్ర్టీలో చాలామంది యంగ్ రైటర్లు లేదు దర్శకులు అవుదాం అనే వారు ఎవరు వచ్చి కథ చెప్పినా కూడా.. అవన్నీ వినేసి.. వాటిలో నచ్చిన కథను కొనేసి పెట్టేస్తున్నారట. ఇలా ఎవరైనా దర్శకులు అవకాశం కోసం స్రవంతి మూవీస్ తలుపు తడితే.. అందులో ఒక కతను ఆ దర్శకులకు ఇచ్చేసి డైరక్ట్ చేయమంటున్నారని టాక్. గతంలో సురేష్ ప్రొడక్షన్స్ లో రామానాయుడు అండ్ సురేష్ బాబు కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యేవారు. నచ్చిన కథను కొనుక్కొని.. తమకు నచ్చిన డైరక్టర్ తో ఆ సినిమాను తీయించేవారు. ఇప్పుడు రామ్ అంకుల్ కూడా అదే ప్రాసెస్ దించేస్తున్నారులే అంటున్నారు సన్నిహితులు.
ఈ సెప్టెంబర్ 30న రామ్ హీరోగా నటించిన ''హైపర్'' సినిమా విడుదలవుతోంది.