శైలజ ఈజ్‌ గాన్‌.. తరువాత ఏంటి?

Update: 2016-03-14 15:30 GMT
ఆల్రెడీ మూడో నెల కూడా ముగిసిపోయేలా ఉంది. జనవరి 1న విడుదలైన ''నేను శైలజ'' సినిమా.. ఇప్పటివరకు నిర్మాత స్రవంతి రవికిషోర్‌ పోగొట్టుకున్నవన్నీ రాబట్టేసింది అని చెప్పలేం కాని.. ఆయన మాత్రం చాలా కాలం తరువాత భారీ లాభాలతో బయటపడ్డారు. సినిమా హిట్టయ్యింది.. ధియేటర్ల నుండి కూడా ఎప్పుడో గాన్‌.. మరి తన అన్న కొడుకు రామ్‌ బాబు పరిస్థితేంటి?

ఎన్నో సినిమాలను రిజక్టు చేసి.. అప్పట్లో శివమ్‌ అండ్‌ నేను శైలజ సినిమాలను ఓకె చేశాడు రామ్‌. వాటిలో శివమ్‌ సినిమా భారీ దెబ్బే వేసింది. బీభత్సమైన డిజాష్టర్‌ అయ్యింది. అందుకే నేను శైలజ విషయంలో కూడా చాలా జాగ్రత్తగానే వ్యవహరించాడు. అయితే ఈ సినిమా హిట్టయ్యింది. అక్కడే తలనొప్పి వస్తోంది. ఇప్పుడు తదుపరి సినిమా ఎలా ఉండాలి మరి? అందుకే రామ్‌ ఎన్ని కథలు విన్నా కూడా ఒక్క ప్రాజెక్టుపై కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడట. ఎంతమంది స్టోరీలు చెప్పినా కూడా.. వినేసి.. నా డెసిషన్‌ తరువాత చెప్తా అంటున్నాడట.

అప్పట్లో శ్రీను వైట్ల డైరక్షన్‌ లో సినిమా అనుకున్నారు కాని.. ఎందుకో అది కూడా వర్కవుట్‌ కాలేదు. ఇంతకీ రామ్‌ ఎవరి సినిమాను ఓకె చేస్తాడో ఏంటో!!
Tags:    

Similar News