సినిమా హిట్టయితే కంగ్రాట్స్ చెప్పాలి కానీ.. దాని బదులు థ్యాంక్స్ చెబుతున్నారేంటంటూ ఆశ్చర్యపోతున్నాడు యువ కథానాయకుడు రామ్. ‘నేను శైలజ’ రూపంలో ఓ మంచి సినిమా అందించినందుకే ఇలాంటి రెస్పాన్స్ వస్తోందని అతను చెప్పాడు. కిషోర్ తిరుమల నేను శైలజ కథ చెప్పినపుడు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి. అలాగే మా పెదనాన్నగారికి కూడా కొన్ని నిజ జీవిత సందర్భాలు కనెక్టయ్యాయి. ఇలా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయిన సినిమా ఇది. అందుకే ఈ సినిమా చూసిన వాళ్లు కంగ్రాట్స్ చెప్పట్లేదు. థ్యాంక్స్ అంటున్నారు. ఇండస్ట్రీకి కూడా ఈ సినిమాతో మంచి విజయం దక్కింది’’ అన్నాడు రామ్.
‘దేవదాసు’ మినహాయిస్తే తన సినిమాల్లో హిట్టయినవన్నీ.. దాదాపుగా ఎంటర్ టైనర్ లే అని.. ఐతే ‘గణేశ్’ అనే సాఫ్ట్ మూవీ చే సినప్పుడు అందరూ తనను మాస్ సినిమాలు చేయమన్నారని.. అప్పుడే ‘కందరీగ’తో హిట్టు కొట్టానని.. ఆ తర్వాత చేసిన మాస్ సినిమాలు దెబ్బ తినడంతో ‘నేను శైలజ’ విషయంలో భిన్నంగా ప్రయత్నించి విజయం సాధించామని రామ్ చెప్పాడు. రామ్ పెదనాన్న - ‘నేను శైలజ’ నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ.. ‘‘ఇదేదో సూపర్ హిట్ అని మేం గొప్పలు చెప్పట్లేదు. ఓ మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమాలోని సెన్సిటివ్ పాయింటుని కమర్షియల్ గా ఎలా డీల్ చేయగలమా అని మొదట సందేహించాం. కానీ కిశోర్ అందరికీ నచ్చేలా తీశాడు’’ అని చెప్పాడు.