వాళ్ళు ఇస్మార్ట్ కోసం వెయిటింగ్ అంట!

Update: 2019-09-06 08:46 GMT
ఈమధ్యకాలంలో మన టాలీవుడ్ సినిమాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే.  డైరెక్ట్ రిలీజుల సంగతి పక్కన పెడితే మన హీరోలు నటించే సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు భారీ ఆదరణ దక్కుతోంది.  టీవీ ఛానల్స్ లో ఆ సినిమాలు టెలికాస్ట్ చేస్తే భారీ టీఆర్పీలు సాధిస్తున్నాయి.  ఇక యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.  కొన్నిటికి బిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.  మన టాప్ స్టార్లందరూ హిందీలో ఇప్పుడు పాపులర్.  వారిలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా ఉన్నాడు.

రామ్ సినిమాలకు యూట్యూబ్ లో తెగ డిమాండ్ ఉంది.  మనోడి ఎనర్జీకి హిందీ ప్రేక్షకులు ఎప్పుడో ఫిదా అయ్యారు.  రామ్ నటించిన సినిమాల్లో చాలా వాటికి 100 మిలియన్ల వ్యూస్ దాటడం విశేషం.  రామ్ తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక పోస్టర్ ను షేర్ చేశాడు.  ఈ పోస్టర్ లో 'ది సూపర్ ఖిలాడి 3'(నేను శైలజ) - 105 మిలియన్లు..  'నెం.1 దిల్వాలా'(ఉన్నదీ ఒక్కటే జిందగీ) - 118 మిలియన్లు.. 'దమ్ దార్ ఖిలాడి'(హలో గురూ ప్రేమ కోసమే) -  100 మిలియన్ల వ్యూస్' అని ఉంది.  ఈ పోస్టర్ కు "నా సినిమాలపై ఇలా ప్రేమ కురిపిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి.. నా మీద పిచ్చి ప్రేమ చూపిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. లవ్- రామ్ పోతినేని" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ థ్యాంక్ యూ మెసేజ్ కి రిప్లైస్ మామూలుగా లేవు.   ఒకరేమో "రామ్ భాయ్ నువ్వు హిందీకి వచ్చెయ్" అని ఆహ్వానిస్తే మరొకరు "అల్లు అర్జున్ తర్వాత మీరు నాకు టాలీవుడ్ లో నచ్చిన యాక్టర్" అంటూ ప్రేమ కురిపించాడు. ఇంకొకరు "రామ్.. మీ సినిమాలన్నీ మూడు మూడు సార్లు చూశాను" అని చెప్తే మరొకరు "ఇస్మార్ట్ శంకర్ కోసం వెయిటింగ్ భాయ్" అని తన మనసులోని మాటను పంచుకున్నాడు.  మరో హిందీ ప్రేక్షకుడు "నీ సినిమాలకు 100 మిలియన్ వ్యూస్ తక్కువ.. కనీసం 200 మిలియన్ వ్యూస్ ఉండాలి" అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఏంటయ్యా రామ్.. నీ టాలెంట్ తో హిందీ ప్రేక్షకుల మనసును ఫుల్లుగా దోచేసినట్టున్నావ్!


Tags:    

Similar News