మ్యాడ్ స్క్వేర్.. మొదటిరోజు బాక్సాఫీస్ లెక్క ఎంతంటే?
యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఫన్ ఎలిమెంట్స్, క్లాసు-మాస్ మిక్స్ కావడంతో ఓపెనింగ్ డే నుంచే థియేటర్లలో పాజిటివ్ వాతావరణం కనిపించింది.;

యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే సాలీడ్ ఓపెనింగ్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో చిన్న సినిమాగా మొదలై పెద్ద విజయాన్ని అందుకున్న ‘మ్యాడ్’కి ఇది సీక్వెల్. మొదటి భాగం సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో థియేటర్ వాతావరణం కూడా కలిసొచ్చింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఫన్ ఎలిమెంట్స్, క్లాసు-మాస్ మిక్స్ కావడంతో ఓపెనింగ్ డే నుంచే థియేటర్లలో పాజిటివ్ వాతావరణం కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో తొలిరోజు హౌస్‌ఫుల్ షోలు రావడం విశేషం. ఇది చిన్న హీరోల సినిమాకి దక్కిన ఊహించని ఆదరణ అని చెప్పాలి.
ఫస్ట్ డే ఏపీ, తెలంగాణ కలిపి దాదాపు రూ.5.27 కోట్లు షేర్ సాధించింది. ఇది టైర్-2 రేంజ్ సినిమాలకు సాధ్యమయ్యే స్థాయిని దాటి మరింత దూకుడుగా కనిపించడం విశేషం. నైజాం ఏరియాలో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అక్కడే 2.35 కోట్లు షేర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫస్ట్ డే నుంచే ఇటువంటి నంబర్లు రావడం నిర్మాతలకు భారీ ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఇంకా ముందు రోజులలో మాట్ స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ పై రాణించాలంటే, మౌత్ టాక్ మెరుగ్గా ఉండాలి. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను నిలబెట్టుకుంటే, మిగతా మూడు రోజులు వారం చివరి వరకు ఓ మంచి రన్ కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం పోటీగా ఉన్న ఇతర సినిమాలు ఉన్నప్పటికీ, యూత్ ఆధారిత కంటెంట్‌తో మ్యాడ్ స్క్వేర్ వేరే జోన్‌లో దూసుకెళ్తోంది. మ్యూజిక్, కామెడీ, ఫ్రెష్ స్క్రీన్‌ప్లే ఇవన్నీ కలిసి సినిమాకి మరింత బలాన్ని ఇచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్లు (షేర్)
నైజాం – ₹2.35 కోట్లు
సీడెడ్ – ₹0.74 కోట్లు
ఉత్తరాంధ్ర – ₹0.62 కోట్లు
ఈస్ట్ – ₹0.37 కోట్లు
వెస్ట్ – ₹0.21 కోట్లు
కృష్ణా – ₹0.28 కోట్లు
గుంటూరు – ₹0.51 కోట్లు
నెల్లూరు – ₹0.19 కోట్లు
మొత్తం షేర్: ₹5.27 కోట్లు