భారీ రేటుకు పెద్ది ఆడియో రైట్స్
ఇదిలా ఉంటే పెద్ది సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివీల్ చేశారు.;

గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. రెండో సినిమానే బుచ్చిబాబు ఈ లెవెల్ లో తెరకెక్కిస్తుండటం చూసి నేనే షాక్ అయ్యా అని సుకుమార్ చెప్పిన మాటలు సినిమాపై హైప్ ను బాగా పెంచేశాయి.

దానికి తగ్గట్టే హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ ను తీసుకొచ్చిన బుచ్చిబాబు సినిమాలోని కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ను రంగంలోకి దింపాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా ఏకంగా రెహమాన్ ను ఇంప్రెస్ చేసి సినిమా మొదలవక ముందే నాలుగు ట్యూన్స్ ను రెడీ చేయించుకున్నాడంటే పెద్ది విషయంలో బుచ్చిబాబు ఎంత ప్రీప్లాన్డ్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటూ టైటిల్ ను రీసెంట్ గా మేకర్స్ రివీల్ చేయగా, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే పెద్ది సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివీల్ చేశారు. పెద్ది ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో సంస్థ టీ- సిరీస్ సొంతం చేసుకుందని తెలిపింది.
పెద్ది మూవీ సాంగ్స్ తో పాటూ సినిమా స్కోర్ ను కూడా టీ సిరీస్ లో వినొచ్చని డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. అయితే ఈ ఆడియో హక్కుల కోసం టీ సిరీస్ ఏకంగా రూ.37 కోట్లు ఖర్చు చేసిందని టాక్ వినిపిస్తోంది. దాంతో పాటూ పెద్దికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను ఏప్రిల్ 6న రిలీజ్ చేయనున్నట్టు బుచ్చిబాబు ఆ పోస్ట్ లో వెల్లడించాడు. ఆల్రెడీ ఫిల్మ్ నగర్ లో ఈ గ్లింప్స్ గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు.
గ్లింప్స్ చూశాక చాలా కాలం పాటూ బుచ్చిబాబు గురించి మాట్లాడుకుంటారని, చరణ్ ఫ్యాన్స్ తో పాటూ నార్మల్ ఆడియన్స్ కు కూడా పెద్ది గ్లింప్స్ నెక్ట్స్ లెవెల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని అంటున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు పెద్ది గ్లింప్స్ చూస్తామా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.