ఇంకో వారం రోజుల్లోనే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘రెడ్’ మూవీ. ఇది తమిళ హిట్ మూవీ ‘తడమ్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ను మించి ఈ సినిమా ఆకర్షణీయంగా తయారైందని, కచ్చితంగా హిట్ కొడతామని ధీమాగా ఉంది చిత్ర బృందం. ఐతే ఈ కాన్ఫిడెన్స్‌తోనే తెలుగుతో పాటు మరో ఆరు భాషల్లో ‘రెడ్’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండటం విశేషం. డబ్బింగ సినిమాల ద్వారా రామ్ ఉత్తరాది ప్రేక్షకులకు బాగానే పరిచయం అయ్యాడు. లాక్ డౌన్ టైంలో అతడికి ఉత్తరాదిన ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఆ సమయంలో ఖాళీగా ఉన్న ‘రెడ్’ టీం ఈ చిత్రాన్ని వేర్వేరు భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినట్లుంది. ఇది తమిళ రీమేక్ కాబట్టి అక్కడ రిలీజ్ చేయాలనుకోలేదు. దక్షిణాదిన మిగతా భాషలైన కన్నడ, మలయాళ భాషల్లోకి సినిమాను అనువాదం చేశారు. అవి కాక హిందీ, భోజ్ పురి, బెంగాళీ, మరాఠి భాషల్లోకి కూడా సినిమాను డబ్ చేశారు.
అనువాద కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయట. ఉత్తరాది వాళ్లకు సంక్రాంతి పండుగ ఉండదు. అక్కడ ఈ నెలలో పెద్దగా సినిమాల సందడి ఉండదు. లాక్ డౌన్ తర్వాత అక్కడ పేరున్న సినిమాలేవీ విడుదల కాలేదు. థియేటర్లు వెలవెలబోతున్నాయి. ‘నా పేరు సూర్య’ సహా కొన్ని తెలుగు డబ్బింగ్ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తే మంచి స్పందనే వచ్చింది. ఈ నేపథ్యంలో ‘రెడ్’ లాంటి కొత్త సినిమాను ఉత్తరాదిన విడుదల చేస్తే మంచి ఫలితమే వస్తుందని.. ఈ మాస్ సినిమా అక్కడి వారిని మెప్పిస్తుందని ఆశిస్తున్నట్లున్నారు. పనిలో పనిగా దక్షిణాదిన కూడా రెండు రాష్ట్రాల్లో డబ్బింగ్ వెర్షన్‌ను వదులుతున్నారు. తక్కువ బడ్జెట్లో వేగంగా పూర్తయిన ఈ సినిమాకు అంచనాల్ని మించి బిజినెస్ జరిగినట్లు సమాచారం. అందుకే మధ్యలో ఓటీటీ ఆఫర్లు వచ్చినా తొందరపడకుండా థియేట్రికల్ రిలీజ్ కోసం ఆపారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెడ్’ను రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మించారు. మాళవిక శర్మ, నివేథా పెతురాజ్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు.