రామ్-ఛానెల్ గొడవ కొత్త టర్న్ తీసుకుంది

Update: 2016-01-07 04:03 GMT
‘‘ఆ ఒక్క ఛానెల్లో తప్ప వరల్డ్ వైడ్ నా సినిమా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషం’’ అంటూ మొన్న రామ్ పెట్టిన ట్వీట్ ఆసక్తికర చర్చకే దారి తీసింది.  ఆ న్యూస్ ఛానెల్ తన సినిమా ‘నేను శైలజ’కు వ్యతిరేకంగా రివ్యూ ఇవ్వడంపై రామ్ ఆవేదన వ్యక్తం చేయడం.. ఆ ఛానెల్‌ ను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్ వేయడం తెలిసిన సంగతే. కాగా ఈ గొడవ నిన్న రాత్రి సరికొత్త మలుపు తీసుకుంది. ఆ ఛానెల్లో పని చేస్తున్న నవీన్ అనే ఎంప్లాయ్ ‘నేను శైలజ’ మీద ఇచ్చిన రివ్యూను వ్యతిరేకిస్తూ సినిమా గురించి పాజిటివ్‌ గా మాట్లాడాడట. దీంతో ఛానెల్ యాజమాన్యం అతణ్ని ఉద్యోగం నుంచి తీసేసింది.

ఈ సంగతి తెలిసిన రామ్ ట్విట్టర్లో ఆవేశంగా రెస్పాండయ్యాడు. నవీన్ తన అభిమాని అని తెలుసుకుని అతడికి సారీ చెప్పాడు. అంతే కాదు.. నవీన్‌ కు ఉద్యోగం వచ్చే వరకు అతడి జీతం తాను ఇస్తానని కూడా ప్రకటించి సంచలనం సృష్టించాడు. ‘‘ఈ సొసైటీ ఎటు పోతోందో నాకర్థం కావడం లేదు. నేను శైలజ రివ్యూ మీద వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ ఛానెల్ నవీన్ అనే ఉద్యోగిని తప్పించిందట. అతను నా ఫ్యాన్ అని కూడా తెలిసింది. ఆ ఛానెల్ నిర్ణయాన్ని గౌరవిస్తా. అందులో లాజిక్ ఉంది. కానీ ఫ్యాన్స్ విషయానికి వస్తే లాజిక్కుల గురించి ఆలోచించను. నవీన్ కు నా సారీ. అతను మరో జాబ్‌ లో చేరే వరకు నా ఆఫీస్‌ కు వచ్చి ప్రతి నెలా జీతం తీసుకోవచ్చు’’ అని ప్రకటించాడు రామ్.
Tags:    

Similar News