రామ్ హ్యాపీస్.. టూర్ ఫినిష్

Update: 2016-02-01 06:33 GMT
2016 ప్రారంభమే హీరో రామ్ కి పెద్ద రిలీఫ్ దక్కింది. చాలా సినిమాల తర్వాత మంచి హిట్ కొట్టగలిగాడు. న్యూ ఇయర్ ని బ్రహ్మాండంగా స్టార్ట్ చేయగలిగాడు. రెండు మూడేళ్లుగా రామ్ కు చెప్పుకోదగ్గ సినిమా లేదు. ముఖ్యంగా శివమ్ తర్వాత కుర్ర హీరో బాగా డల్ అయ్యాడనే చెప్పాలి. అందుకే తనను తను పూర్తిగా ఛేంజ్ చేసుకుని, ఏ మాత్రం ఎగ్జయిట్మెంట్ కు గురి కాకుండా.. కేవలం పాత్ర పరిధిలోనే ఉంటూ నేను శైలజ చేశాడు. ఇది సూపర్ హిట్ సాధిచండంతోగా.. చాలా రిలీఫ్ పొందాడు రామ్.

తన సంతోషాన్ని పంచుకోవడానికి సోదరులిద్దరితో కలిసి హాంగ్ కాంగ్ ట్రిప్ వెళ్లాడు రామ్. కొన్ని రోజుల పాటు సరదాగా గడిపాడు. రీసెంట్ గా అక్కడి నుంచి తిరిగొచ్చి... ఫోటోను ట్వీట్ చేశాడు రామ్. ఏమైనా ఓ  హిట్ కుర్రాడిలో చాలా ఛేంజ్ తీసుకొచ్చింది. మామూలుగానే ఎనర్జిటిక్ గా కనిపించే ఈ హీరో.. ఇప్పుడు ఇంకా ఖుషీగా కనిపిస్తున్నాడు. ఆ హ్యాపీనెస్ గ్లో రూపంలో ఫేస్ లో కనిపిస్తోంది.

ఇక నుంచి స్టోరీ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నాడట ఈ హీరో. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఇమేజ్ కు భిన్నంగా వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడని చెబుతున్నారు. త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్స్ అనౌన్స్ చేయనున్నాడు ఈ కుర్ర హీరో.

Tags:    

Similar News