కాలం ఎంత వేగంగా సాగిపోతుందో చూడండి.. ‘దేవదాసు’ సినిమా ఐదారేళ్ల ముందు వచ్చినట్లే ఉంది. కానీ అప్పుడే పదేళ్లు గడిచిపోయాయట ఆ సినిమా వచ్చి. తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్ల ప్రస్థానం పూర్తయిందంటూ రామ్ తన ఆనందాన్ని పంచుకుంటే కానీ.. ఈ సినిమా వచ్చి పదేళ్లయిపోయిందన్న సంగతి గుర్తు రావట్లేదు జనాలకు. ‘‘పది సంవత్సరాలు.. నా జీవితంలో పది అందమైన సంవత్సరాలు.. మీ ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీ రుణం తీర్చుకోవడానికి చేయాల్సిందల్లా చేస్తా. చివరి వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా’’ అని అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
2006 జనవరి 11న రామ్ తొలి సినిమా ‘దేవదాసు’ విడుదలైంది. మొదట ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత జనాలు దాన్ని అద్భుతంగా ఆదరించారు. సిల్వర్ జూబ్లీ హిట్ తో హీరోగా అరంగేట్రం చేసిన రామ్.. ఈ పదేళ్లలో మొత్తం 13 సినిమాల్లో నటించాడు. ఐతే అందులో హిట్టు సినిమాలు నాలుగు మాత్రమే. దేవదాసు తర్వాత, రెడీ, కందిరీగ రామ్ కు మంచి విజయాలందించాయి. ‘కందిరీగ’ తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న రామ్.. ఎట్టకేలకు ‘నేను శైలజ’తో మళ్లీ ఓ హిట్టు ఖాతాలో వేసుకున్నాడు. పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సమయంలో ‘నేను శైలజ’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇకపై తానెలాంటి సినిమాల్లో నటించాలన్నది కూడా రామ్ కు ఈ సినిమాతో ఓ ఐడియా వచ్చే ఉంటుంది. మున్ముందు అతను మరిన్ని విజయాలందుకోవాలని ఆశిద్దాం.