కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని ఉన్న పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకు కరోనా తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇక సంపూర్ణ లాక్ డౌన్ షరతులు సడలించిన తర్వాత కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో భయంతో ప్రజలు వణికి పోతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలకు కూడా కరోనా సోకడంతో అందరూ భయపడిపోతున్నారు. ఈ వైరస్ కి ఇంకా వ్యాక్సిన్ రాకపోవడంతో దీని కట్టడికి అందరూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యమయింది. ఈ నేపథ్యంలో మాస్కులు - గ్లౌజులు - శానిటైజర్స్ మన జీవితంలో ఒక భాగమయ్యాయి. ముఖ్యంగా మాస్కులు మనకు రక్షణ కవచంలా మహమ్మారి సోకకుండా కాపాడుతుందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ వినియోగంపై పలు సూచనలు చేశాయి. వీటిని పట్టించుకోకుండా మాస్కులు ధరించని వారికి ఫైన్ కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అందరినీ ఆకర్షించేలా ఇప్పుడు మాస్క్ ధరించాడు.
రామ్ పోతినేని కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో సూపర్ మ్యాన్ లాంటి డ్రెస్ వేసుకుని తనని తాను మహమ్మారి బారి నుంచి ఎలా రక్షణ పొందుతున్నాడో చూపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో రామ్ బాడీ మొత్తం కనిపించకుండా కవర్ చేసుకొని కనిపిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే రామ్ నటించిన 'రెడ్' సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేసారు. శ్రీ స్రవంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.
Full View Full View