సినిమా రంగంలో ఏ విభాగంలో పని చేసినా తమను తాము ఓసారి తెరపై చూసుకోవాలని కుతూహలం ఉండటం సహజం. దర్శక ధీరుడు రాజమౌళి కూడా అందుకు అతీతుడు కాదు. అందుకే బాహుబలి సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించి కుతూహలం తీర్చుకున్నాడు. పాటల రచయితగా మంచి స్థాయి అందుకున్న రామజోగయ్య శాస్త్రికి కూడా తెరపై కనిపించాలని చాలా కోరికే ఉంది. ఇంతకుముందు కిక్ సినిమాలో ఓ చిన్న సన్నివేశంలో కనిపించిన రామజోగయ్య.. ఈ మధ్యే ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’లో ఖవ్వాలీ గాయకుడిగా దర్శనమిచ్చాడు.
ఐతే ఊరికే పాటలో అలా కనిపించడం కాకుండా నటుడిగా ఓ క్యారెక్టర్ చేయడానికి రెడీ అయిపోయారాయన. అది కూడా కమల్ హాసన్ సినిమాతో ఆయన నటుడి అవతారం ఎత్తుతుండటం విశేషం. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న కమల్ కొత్త సినిమా ‘చీకటి రాజ్యం’లో రామజోగయ్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందుకోసం ఆయన వేసిన గెటప్ కూడా ఆసక్తికరంగా ఉంది. వైట్ అండ్ వైట్ డ్రెస్సులో, ఫ్రెంచ్ గడ్డంతో, కళ్లజోడు పెట్టుకుని భలే చిత్రంగా తయారయ్యారు శాస్త్రిగారు. ఆయన పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే సినిమాకు గుమ్మడికాయ కూడా కొట్టేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.