మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 29వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. టెక్నికల్ టీమ్ మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరో మరియు హీరోయిన్ లు ఇతర యూనిట్ సభ్యులు త్వరలోనే మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఇంతకు ముందే రావాల్సి ఉంది. కాని ఆ సమయం కు ఆశించిన స్థాయిలో సినిమా బిజినెస్ చేయలేక పోయింది. దాంతో సినిమా ను వాయిదా వేశారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా సినిమా బిజినెస్ ఆశించిన స్థాయి లో జరగలేదనే సమాచారం అందుతోంది. దాంతో సినిమాను ఓన్ రిస్క్ తో సినిమాను విడుదల చేయబోతున్నారట.
ఈ సినిమాను ఎస్ ఎల్ వి సినిమాస్ తో కలిసి రవితేజ తన సొంత నిర్మాణ సంస్థ ఆర్ టీ టీమ్ వర్క్స్ బ్యానర్ లో నిర్మించాడు. ఈ సినిమాను సొంతంగా విడుదల చేయడం ద్వారా ఖచ్చితంగా రిస్క్ ఎక్కువ అనే టాక్ వినిపిస్తుంది. సినిమా కు ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశించిన స్థాయిలో కాకపోవడంకు కారణం ఇటీవల విడుదల అయిన రవితేజ ఖిలాడి సినిమా అనే టాక్ కూడా ఉంది.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఖిలాడి సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం లో విఫలం అయ్యింది. అందుకే బయ్యర్లు రామారావు ఆన్ డ్యూటీ సినిమాను కొనుగోలు చేసేందుకు వెనకాడుతున్నారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అందుకే ఖిలాడి సినిమా ప్రభావంతో ఈ సినిమా బిజినెస్ కూడా చాలా తగ్గిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఈ సినిమాతో దర్శకుడిగా శరత్ మండవ పరిచయం అవుతున్నాడు. ఆ కారణం వల్ల కూడా సినిమా పై బయ్యర్లలో నమ్మకం కుదరడం లేదు. సినిమాకు మొదటి నుండి హైప్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలం అయ్యారు. కనుక సినిమా బిజినెస్ టైమ్ కు పెద్దగా సందడి చేయలేక పోయింది అనేది కొందరి అభిప్రాయం.
రవితేజ కు జోడీగా ఈ సినిమా లో రజిష విజయన్ నటించగా కీలక పాత్రలో దివ్యాంశ కౌశిక్.. నాజర్.. పవిత్ర లోకేష్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రవితేజ ఒక ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడు.