మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''రామారావు ఆన్ డ్యూటీ''. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ - రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
ఒక ఆపరేషన్ లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు మాయమయ్యారని చెప్పడం.. ఒక పాప తన తండ్రిని వెతకడంలో సహాయం చేయమని అడగడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో రవితేజను ప్రజల కోసం నిలబడే నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా చూపించారు.
అయితే 'ఇన్నాళ్లూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్ట ప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను.. ఇక రామారావుగా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను' అని రవితేజ చెప్పడం చూస్తుంటే.. ధర్మాన్ని కాపాడటానికి అతను వేరే మార్గాన్ని ఎంచుకున్నట్లు అర్థం అవుతోంది.
రవితేజ నుంచి ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ అంశాలతో దర్శకుడు శరత్ ఈ థ్రిల్లర్ ను రూపొందించారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో అతను పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఇందులో చాలా సీరియస్ గా కనిపించాడు.
ఇందులో వేణు తొట్టెంపూడి మరియు ‘సర్పట్ట’ జాన్ విజయ్ పోలీసులుగా కనిపించారు. ఇద్దరు హీరోయిన్లతోనూ రవితేజ లవ్ ట్రాక్ ను చూపించారు. అదే సమయంలో అతను తీసుకున్న నిర్ణయం వల్ల ఫ్యామిలీ కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో నాజర్ - సీనియర్ నరేష్ - పవిత్ర లోకేష్ - చైతన్య కృష్ణ - తనికెళ్ల భరణి - రాహుల్ రామకృష్ణ - ఈరోజుల్లో శ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
అసలు ఆ ప్రాంతంలోని వ్యక్తులు ఎందుకు మిస్ అవుతున్నారు? వారికి మాయం చేస్తున్నదెవరు? ఆ ఆపరేషన్ వెనుక ఉన్నదెవరు? రామారావు ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు? కనిపించకుండా పోయిన వారిని తిరిగి తీసుకొచ్చాడా లేదా? అనేది తెలియాలంటే 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా చూడాల్సిందే.
ట్రైలర్ కు శ్యామ్ సీఎస్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ అందించిన విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఈ చిత్రానికి ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మొత్తం మీద ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసిందని చెప్పాలి.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ''రామారావు ఆన్ డ్యూటీ'' చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Full View