మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో వున్నారు. `క్రాక్` బ్లాక్ బస్టర్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన మాస్ మహా రాజా రవితేజ ఈ మూవీ సక్సెస్ ఆనందంతో ఫుల్ జోష్ లో వున్న ఆయన ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఐదు చిత్రాలకు పైనే వున్నాయి. ఇందులో రెండు మూడు చిత్రాలు రిలీజ్ కి రెడీ అయిపోయాయి. కూడా ఇప్పటికే పూర్తయిన `ఖిలాడీ` ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధమవుతుండగా మరో సినిమా కూడా రెడీ అయిపోయింది.
అదే `రామారావు ఆన్ డ్యూటీ`. శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో `మజిలీ` ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవల మార్చి 25న థియేటర్లలో విడుదల చేయబోతున్నామంటూ మేకర్స్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇదే డేట్ న `ఆర్ ఆర్ ఆర్` ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించడంతో రవితేజ తన `రామారావు ఆన్ డ్యూటీ` మూవీ రిలీజ్ డేట్ ని మార్చేస్తున్నట్టుగా ప్రకటించి షాకిచ్చారు.
ఇటీవల పరిణామాల కారణంగా, పరిశ్రమ మేలు కోసం `రామారావు ఆన్ డ్యూటీ` ని మార్చి 25న లేదా ఏప్రిల్ 15న పెద్ద స్క్రీన్‌లలోకి తీసుకురావాలని భావిస్తున్నాం` అని ప్రకటించారు. అయితే మార్చి 25న `ఆర్ ఆర్ ఆర్` విడుదల ఫిక్స్ కావడంతో `రామారావు ఆన్ డ్యూటీ` నిలీజ్ డేట్ ని ఏప్రిల్ 15కు మార్చారు బాగానే వుంది. అయితే ఇక్కడే మాస్ రాజా చిత్రానికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఏప్రిల్ 14న కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన క్రేజీ మూవీ `కేజీఎఫ్ చాప్టర్ 2` రిలీజ్ కాబోతోంది. డబ్బింగ్ చిత్రమే అయినా దీని క్రేజ్ ముందు `రామారావు ఆన్ డ్యూటీ` నిలబడుతుందా? అన్నది ఇప్పుడున్న ప్రశ్న.
`రామారావు ఆన్ డ్యూటీ` రిలీజ్ ని ఏప్రిల్ 15కు మార్చడం ఒక విధంగా చెప్పాలంటే యష్ తో రవితేజ పోటీకి కాలుదువ్వుతున్నట్టే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. `ఆర్ ఆర్ ఆర్` కోసం 25ని వదిలేస్తే `కేజీఎఫ్`తో తలపడాల్సిన పరిస్థితి. మరి ఈ విపత్కర పరిస్థితి నుంచి రవితేజ తన చిత్రాన్ని ఎలా నిలబెట్టుకుంటాడన్నది ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ చర్చగా మారింది.
కోవిడ్ కారణంగా వరుసగా భారీ చిత్రాల రిలీజ్ డేట్ లు మారుతూ వస్తున్న విషయం తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్`, `రాధేశ్యామ్` రిలీజ్ లు వాయిదా పడటంతో తాజా గా కొన్ని చిత్రాల రిలీజ్ డేట్ ల విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడిందని, అది ఇప్పుడు రవితేజ చిత్నానికి పెద్ద అడ్డంకిగా మారబోతోందని చెబుతున్నారు.రామారావు ఆన్ డ్యూటి`ని మార్చి 25న రిలీజ్ చేస్తే `ఆర్ ఆర్ ఆర్` తో పోటీపడక తప్పదు. అలా అని ఏప్రిల్ 15న రిలీజ్ చేస్తే `కేజీఎఫ్` కారణంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.. ఈ పరిస్థితుల్లో రవితేజ తన చిత్రానికి మరో కొత్త డేట్ ని నిర్ణయించుకుంటాడా? లేక ఏదైనా మన మంచికే అనుకుంటూ ప్రకటించిన డేట్ లలోనే రిలీజ్ కు సిద్ధపడతా? అన్నది వేచి చూడాల్సిందే.