90వ దశకంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. తెలుగుతోపాటు తమిళ, మలయాళం, భోజ్పురిల, హిందీలో పలు అగ్రహీరోలతో రంభ నటించింది. 2010లో కెనడా బిజినెస్‌మ్యాన్ ఇంద్రన్ పద్మనాభన్ ను పెళ్లి చేసుకున్న రంభ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కెనడాలో స్థిర పడిన రంభకు లాస్య (7) - సాషా (3) అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. తాను త్వరలోనే మరోసారి తల్లి కాబోతున్నానంటూ రంభ ...కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, సోమవారం నాడు రంభ సీమంతాన్ని ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు. తన శ్రీమంతం సందర్భంగా రంభ తన బంధువులతో కలిసి సంతోషంగా స్టెప్పులు వేసింది. ఆ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రంభ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
2010లో ఇంద్రన్ ను పెళ్లి చేసుకున్న రంభ కెనడాలో సెటిల్ అయింది. అయితే, వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2016లో తన భర్త నుంచి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టుకు రంభ వెళ్లింది. తన పిల్లల సంరక్షణ కోసం నెలకు రూ.2.50 లక్షలు చెల్లించాలని కోర్టును కోరింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఇద్దదూ కలిసుండాలని, ఒక అవగాహనకు రావాలని కోరింది. దీంతో, మనసు మార్చుకున్న వారిద్దరూ.... చర్చించుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని కోర్టుకు వారిద్దరూ తెలపడంతో జడ్జి విడాకుల కేసును కొంతకాలం క్రితం కొట్టివేశారు. ఆ తర్వాత తన భర్తతో కలిసి సంతోషంగా ఉంటోన్న రంభ త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలోనే ఆమె భర్త - కుటుంబసభ్యులు....రంభకు ఘనంగా సీమంతం నిర్వహించారు.