పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' దుమారం గురించి చెప్పాల్సిన పనిలేదు. 1200 కోట్ల వసూళ్లతో ఇండియాన్ బాక్సా ఫీస్ ని ఫేక్ చేసిన చిత్రమిది. అమెరికాను సైతం అల్లల్లాడించేసింది. హాలీవుడ్ లోనూ 'ఆర్ ఆర్ ఆర్' ఓ వెలుగు వెలిగింది. నేరుగా చరణ్ కే అవకాశాలు కల్పించిన చిత్రంగా నిలిచింది. అలాగే ఆస్కార్ బరిలోనూ నిలుస్తున్న సంగతి తెలిసిందే.
ఇండియన్ జ్యూరీ రిజెక్ట్ చేసినా జనరల్ కేటగిరీ విభాగంలో జక్కన్న చిత్రాన్ని బరిలోకి దించుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ రిలీజ్ ని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేయాల్సి వస్తోంది. ఈనెల 21న జపాన్ లో సినిమా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచార కార్యక్రమాలు ఇండియన్ రిలీజ్ కి ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ చేరుకుని అక్కడి మీడియాని చుట్టేస్తున్నారు. దొరికిన ఏ మీడియా సంస్థని విడిచిపెట్టడం లేదు.
అయితే భీమ్కి కి ఇంకా రామ్ తోడవ్వలేదు. రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటంతో ఇంత వరకూ జపాన్ చేరుకోలేదు. తాజాగా నేడు చరణ్ జపాన్ ప్రయాణం షురూ అయినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం చరణ్ ఉపాసనతో కలిసి జపాన్ ప్లైట్ ఎక్కడానికి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. దంపతులిద్దరు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఈ ఉదయమే ప్రత్యక్షమయ్యారు.
దంపతులిద్దరు వారం రోజులకు సరిపడ లగేజీతో ప్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. చరణ్ అక్కడ వారం రోజుల పాటు ఉండనున్నారని సమాచారం. రిలీజ్ కి ముందు మీడియా ఇంటర్వ్యూలు... ఆ తర్వాత జపాన్ ఆడియ న్స్ తో సినిమా చేసే అవకాశం ఉంది. అటుపై వాళ్ల రెస్పాన్స్ ని బట్టి మరోసారి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది.
అయితే చరణ్ తో పాటు ఉపసాన మీడియా సమావేశాల్లో పాల్గొంటారా? లేదా? అన్నది చూడాలి. అలా కాకపోతే చరణ్ మీడియా ప్రమోషన్ లో బిజీ గా ఉంటే ఉపాసన జపాన్ అందాల్ని ఆస్వాదించే పనిలో ఉండే ఛాన్స్ ఉంది.
హైదరాబాద్ లో ఇద్దరు చాలా బిజీ. వెకేషన్లకు వెళ్లే సంమయం కూడా దొరకదు. ఏడాదికి ఒకటి ..రెండు సార్లు మాత్రమే సమయం కేటాయిస్తుంటారు. ఈనేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' జపాన్ రిలీజ్ ఈ రకంగా దంపతులిద్దరికీ కొంత వరకూ విరామాన్ని ఇస్తున్నందని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.