మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `ఆర్.ఆర్.ఆర్` చిత్రంతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే చరణ్ అనుకున్నది జరిగి ఉండేది. కాకపోతే కాస్త ఆలస్యమవుతోంది. ఇక `ఆర్ ఆర్ ఆర్` ప్రచారంలో భాగంగా చరణ్ ముంబై..చెన్నై..బెంగుళూరు నగరాల్ని చుట్టేసిన సంగతి తెలిసిందే. ప్రతీ ఈవెంట్లో ఎంతో తెలివిగా..బ్యాలెన్స్ డ్ గా మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్నాడు. ప్రతీ మాట భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడినట్లు అనిపించింది. ఇప్పుడు ఆ విషయాన్ని ఓపెన్ గాను చెప్పేసాడు. ఇప్పటివరకూ టాలీవుడ్ నటుడిని అని చెప్పుకునే చరణ్ ఇప్పుడు భారతీయ నటుడిని అని చెప్పుకోవడం విశేషం.
మనమంతా ఒకే పరిశ్రమకు చెందిన వాళ్లం. అదే భారతీయ చలన చిత్ర పరిశ్రమ..! అని ప్రస్థావిస్తూనే.. అన్ని పరిశ్రమల్ని ఒకేతాటిపైకి తీసుకొచ్చి మాట్లాడటం ఆసక్తికరం. దర్శకుడు రాజమౌళి గారు చేసిన ప్రయత్నాల కారణంగా ఇతర పరిశ్రమల ద్వారాలు తెరుచుకున్నాయి. మేము ప్రాంతీయంగా ఉండటం మానేసి ఒక పెద్ద భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భాగమయ్యాం. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. నటులు అందరికి అవకాశం వచ్చింది. అలాంటప్పుడు ఎందుకు నటించకూడదు? నేను ఏ సినిమా అయినా చేస్తాను. సినిమా అనేది ఎన్ని భాషల్లోనైనా రిలీజ్ అవుతుంది. ఎన్ని అడ్డంకులున్నా తొలగిస్తుంది అని అన్నారు.
ఇక చరణ్ లైనప్ చూస్తే వరుసగా అన్నీన్ని పాన్ ఇండియా కేటగిరిలోనే ప్లాన్ చేస్తున్న విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం దేశం గర్వించద గ్గ దర్శకుడు శంకర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్.సి 16 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఇది పాన్ ఇండియా సినిమా. అలాగే యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ యంగ్ మేకర్ కంటెంట్ కూడా యూనివర్శల్ అప్లీల్ తీసుకొస్తుంది. `జెర్సీ` సినిమాతో ఇండియా వైడ్ మంచి దర్శకుడిగా పేరు సంపాదించాడు. ఇప్పుడు `జెర్సీ`ని బాలీవుడ్ లోనూ రీమేక్ చేస్తున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తోనూ ఓ ప్రాజెక్టు చర్చల్లో ఉన్న సంగతి తెలిసిందే.