గౌత‌మ్ కి అచ్చుగుద్దిన‌ట్లే ర‌మేష్ బాబు త‌న‌యుడు!

Update: 2022-07-20 12:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్-బ్ర‌ద‌ర్ ర‌మేష్ బాబు మ‌ధ్య ఉండే అన్యోన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.  ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ క‌న్నా మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం..త‌న ప్ర‌తీ విష‌యాన్ని అన్న‌య్య‌తో పంచుకునేవాడిన‌ని...తండ్రితో చెప్ప‌లేని ఎన్న‌వో విష‌యాలు అన్న‌య్య ద్వారా చెప్పి సాధించుకునే వాడిన‌ని చాలా సంద‌ర్భాల్లో రివీల్ చేసారు.

త‌న‌కి బ్ర‌ద‌ర్ కన్నా..స్నేహితుడిగా..గైడ్ గా ఎంతో స‌హకారం అందించేవాడ‌ని..మ‌హేష్ సూప‌ర్ స్టార్ అయ్యాడంటే? అందులో అన్న‌య్య పాత్ర ఎంతో ఉంద‌ని అంటుంటారు. ర‌మేష్ పై త‌న‌కున్న అభిమానం..ప్రేమ ఏస్థాయిలో ఉంటుంద‌నేది `స‌ర్కారు వారి పాట` ప్రీ రిలీజ్ వేడుక‌లో బ‌య‌ట పెట్టే ప్ర‌య‌త్నం చేసారు. సాధార‌ణంగా ఇలాంటి విష‌యాల్లో మ‌హేష్ ఓపెన్ గా మాట్లాడ‌రు. కానీ కళ్ల ముందు అభిమానులు క‌నిపించేస‌రికి ఆ బాధ‌ని కొంతైనా దించుకోవాల‌ని అలా ఓపెన‌ప్ అయ్యారు.

ఎమోష‌న్ కి గుర‌య్యారు. అదీ ర‌మేష్ బాబు మ‌హేష్ కున్న అనుబంధం. అన్న‌య్య హీరో అవ్వలేదు...క‌నీసం పెద్ద నిర్మాత‌గానైనా చూడాల‌ని ఆశ‌ప‌డుతున్న‌ట్లు చాలాసార్లు మ‌హేష్ అన్నారు. ఆయ‌నొచ్చి సినిమా చేస్తానంటే  అన్ని సినిమాలు ప‌క్క‌న‌బెట్టేసి అత‌నితోనే సినిమా చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.  కానీ ఇప్పుడా ఛాన్స్ లేకుండాపోయింది.

అయితే ఆ  ప్రేమ‌ని ర‌మేష్ బాబు త‌న‌యుడు ఘ‌ట్ట‌మనేని జ‌య‌కృష్ణ‌పై చూపించే అవ‌కాశం ఉంది. తాజాగా జ‌య‌కృష్ణ ఫోటో ఒక‌టి నెట్టింట  వైర‌ల్ గా మారింది. దీంతో జ‌య‌కృష్ణ‌పై బాబాయ్ ప్రేమ చూపించ‌కుండా ఉంటారా? అన్న సందేహం నుంచే ఇవ‌న్నీ ఉత్ప‌న్నం అవుతున్నాయి.  ఇక జ‌య‌కృష్ణ మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్ కృష్ణ‌కి అచ్చు గుద్దిన‌ట్లే ఉన్నాడు.
 
ఇద్ద‌రి ముఖాలు ఒకేలా ఉన్నాయి. ఒకే రంగు. సొంత అన్న‌ద‌మ్ములా క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ రెండు ఫోటోలు పక్క ప‌క్క‌నే బెట్టి పోలిక‌లు  ప‌రిశీలిస్తున్నారు నెటి జ‌నులు. పూల‌చొక్కా...న‌ల్ల ప్యాంట్ ధ‌రించిన జ‌య‌కృష్ణ క్యాజువ‌ల్ గా దిగిన ఫోటోలా కనిపిస్తుంది.

 ప్రస్తుతం జ‌య‌కృష్ణ వ‌య‌సు 20 ఏళ్లు. అంటే హీరోగా ఎంట్రీ ఇచ్చే వ‌య‌సు వ‌చ్చేసింద‌ని చెప్పొచ్చు. మ‌రి  అత‌గాడి ఆస‌క్తి  తతాతాయ్య‌..బాబాయ్ లా సినిమాల‌పై ఉందా?  లేక తండ్రిలా బిజినెస్ వైపు వెళ్లాల‌నుకుంటున్నాడా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News