వివాదంలో ద‌ర్శ‌కనిర్మాత‌ ర‌మేష్ వ‌ర్మ‌

Update: 2019-10-06 08:56 GMT
ర‌క‌ర‌కాల వివాదాలు.. కోర్టు కేసులు టాలీవుడ్ ని అట్టుడికిస్తున్నాయి. ఇటీవ‌లే సైరా .. వాల్మీకి చిత్రాల‌ వివాదం గురించి తెలిసిందే. తాజాగా సెవెన్ చిత్ర నిర్మాత ర‌మేష్ వ‌ర్మ‌ పై ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు న‌మోద‌వ్వ‌డం ఫిలింన‌గ‌ర్ లో హాట్ టాపిక్ గా మారింది. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాక్ష‌సుడు చిత్రం ఇటీవ‌లే రిలీజై విజ‌యం అందుకుంది. అయితే ఆయ‌న నిర్మించిన‌ 'సెవెన్' చిత్రం రిలీజ్ స‌మ‌యంలో ర‌క‌ర‌కాల వివాదాలు తెర‌పైకి వ‌చ్చాయి. సెవెన్ చిత్రానికి నిర్మాత‌గా ఉన్న‌ ర‌మేష్ వ‌ర్మ త‌న‌ని మోసం చేశాడు అంటూ అప్ప‌ట్లోనే ఓ ఎన్నారై అత‌డిపై ఫిలింఛాంబ‌ర్ కి ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది.

పోలీసుల‌కు ఈ ఈ్య‌వ‌హారం పై ఫిర్యాదు చేశారు. తాజాగా ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ఓ యువ‌తికి అస‌భ్యక‌ర‌మైన మెసేజ్ పెట్టారు అంటూ తెలంగాణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క‌మీష‌న్ లో ఫిర్యాదు న‌మోదైంది అంటూ ఓ లేఖను మీడియాకి రిలీజ్ చేశారు. అయితే ఈ లేఖ‌లో ర‌మేష్ వ‌ర్మ సెవెన్ చిత్రాన్ని నిర్మించార‌ని.. అప్ప‌ట్లోనే ఆర్థిక వ్య‌వ‌హారాల్లో వివాదాలు ఉన్నాయ‌ని ప్ర‌స్థావించారు. సినిమా రిలీజ్ స‌మ‌యంలో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల కోసం త‌న‌నుంచి 15 ల‌క్ష‌లు తీసుకున్న ర‌మేష్ వ‌ర్మ 4 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసినా మిగ‌తా 11 ల‌క్ష‌లు తిరిగి చెల్లించ‌లేద‌ని స‌ద‌రు వ్య‌క్తి ఆరోపిస్తున్నారు. వారంలో ఇస్తాన‌ని నాలుగు నెలలుగా త‌ప్పించుకుని తిరుగుతున్నాడ‌ని.. ఆ సంస్థ త‌ర‌పున అమ్మాయికి అస‌భ్య‌క‌ర మెసేజ్ ని పంపించార‌ని వెల్ల‌డించారు. పోలీస్ కేసు పెడితే ఇన్ ఫ్లూయెన్స్ ఉప‌యోగించి త‌ప్పించుకున్నాడ‌ని ఆరోపిస్తూ లేఖ‌లో పేర్కొన్నారు.

దీని పై తెలంగాణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క‌మీష‌న్ కి ఫిర్యాదు చేస్తే అక్టోబ‌ర్ 3 రాత్రి 10.24 నిమిషాల‌కు ఫిర్యాదు న‌మోదైందని వెల్ల‌డించారు. చెన్న‌య్ లో ఉన్నాన‌ని త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఈ లేఖ‌లో పేర్కొన్నారు. అయితే ఇందులో వాస్త‌వం =ఎంత‌? అన్న‌ది ర‌మేష్ వ‌ర్మ మీడియా ముఖంగా చెప్పాల్సి ఉంది.
Tags:    

Similar News