వివాదాస్పద అంశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పండగలు, దేవుడు, దయ్యం లాంటి వేవీ తాను పట్టించుకోనని బాహాటంగా చెబుతూ పలు సందర్భాల్లో వివాదాల్లో ఇరుక్కున్నారు కూడా. కోర్టు కేసులతో వార్తల్లో నిలిచారు. అయినా తన తీరు మారలేదు. వినాయకుడిపై, పండగలపై, న్యూయర్ సెలబ్రేషన్ లపై వర్మ తన స్టైల్లో పంచ్ లు వేస్తూనే వున్నారు. అయితే ఇటీవల ఆయన వ్యవహార శైలితో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తోంది.
న్యూ ఇయర్ వేడుకల సమయంలో విషెస్ లు చెప్పడం.. ఫెస్టివెల్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ లు పెట్టడం మొదలుపెట్టారు వర్మ. తాజాగా భోగి సందర్భంగా వర్మ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పండగలకు గత కొన్నేళ్లుగా శుభాకాంక్షలు చెప్పడమే ఇష్టపడని వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
`మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు, అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు. చిన్న సినిమాలు `బాహుబలి` కంటే పెద్ద హిట్ కావాలి. ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచాలి. నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా చనిపోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు` అంటూ వర్మ పెట్టిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
పండగ పూట వర్మ ఇలా ట్వీట్ చేశాడేంటని అంతా అవాక్కవుతున్నారు. వర్మ ట్వీట్ పై నెట్టింట మీమ్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి. ఇటీవల వర్మ ఏపీ టికెట్ రేట్ల పై చర్చించడానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానితో ప్రత్యేకంగా భేటి కావడం తెలిసిందే. భేటీ తరువాత తాపీగా బిర్యానీ తిని తిరిగొచ్చిన వర్మ .. ఏ ఒక్కరినో ఉద్దేశించి టికెట్ రేట్లని తగ్గించాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.