బాహుబలి వెనక రామోజీ హస్తం?

Update: 2015-06-28 01:30 GMT
250కోట్ల బడ్జెట్‌ అంటేనే అదో సాహసం. తెలుగువాడి ఊహకైనా అందనిది. కానీ అంత బడ్జెట్‌తో సినిమా తీసి చూపించాడు టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజమౌళి. బాహుబలి రెండు భాగాల కోసం అంత బడ్జెట్‌ని ఎస్టిమేట్‌ చేశాడు. అయితే ఆ డబ్బు మొత్తాన్ని అతడు ఏ రూపంలో తీసుకొచ్చాడు అన్నదే పాయింట్‌. అయితే దేని లెక్కలు దానికి ఉన్నాయిక్కడ.

మొత్తం లిక్విడ్‌ క్యాష్‌ రూపంలో బాక్స్‌లో పెట్టుకుని రెడీగా ఉండడం కుదరదు. దానికి రకరకాల మార్గాలున్నాయి. పీపీపీ పద్ధతిలో ఒక కంపెనీ వేరొక కంపెనీని కలుపుకుని లాభాల్లో వాటాలు పంచుకునే ఒక పద్ధతి ఉంది. షేరింగ్‌ బిజినెస్‌ సిస్టమ్‌ అనేది ఇటీవలి కాలంలో బాగా పాపులర్‌ అయ్యింది. ఇద్దరుముగ్గురు నిర్మాతలు కలవడం, ఒక భారీ బడ్జెట్‌ సినిమా తీయడం అన్నది ఎప్పట్నుంచో ఉన్నదే. ఇప్పుడు కె.రాఘవేంద్రరావు కూడా అదే తీరగా బాహుబలి కోసం భారీగా పెట్టుబడుల్ని సమీకరించారు.

ఈ సినిమా మెజారిటీ భాగం రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కింది. ఆ టైమ్‌లో రామోజీ సపోర్టుకి మా ధన్యవాదాలు అంటూ రాజమౌళి అండ్‌ టీమ్‌ పలుమార్లు ప్రస్తావించింది. అంటే దానర్థం రామోజీ ఫిలింసిటీకి కూడా బాహుబలి పెట్టుబడిలో షేర్‌ ఉందనేనా? ఈ సినిమా షూటింగు కోసం ఆర్‌ఎఫ్‌సీకి ఇవ్వాల్సిన డబ్బులే రామోజీరావు షేర్‌ అని వినిపిస్తోంది. ప్రస్తుతం ఇంటా బైటా ఈ విషయంపైనే  చర్చ సాగుతోంది. ఒక లొకేషన్‌ని ఉపయోగించుకుంటే రోజుకి ఇంత అని లెక్కగట్టి ఇచ్చే పద్ధతిలో కాకుండా సినిమా పూర్తి చేసి రిలీజ్‌ చేశాక దాన్నుంచి లాభాల్లో వాటా ఇవ్వాలన్నది కొత్త ఒప్పందమట. దీనికి రామోజీరావ్‌ ఆద్యుడు అని చెప్పాలి. భారీ సినిమాలు తీసేవాళ్లకు ఇది కొంత ఊరట కలిగించేదే.

అలాగే ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాని పూర్తిగా ఫిలింసిటీలోనే షూటింగ్‌ చేసుకుని, ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేసుకుని వెళ్లడానికి అవసరమయ్యే సాంకేతికత, వసతి ఆర్‌ఎఫ్‌సీలో ఉంది. అందుకే ప్రపంచంలో ఈ ఫిలింసిటీ అంతగా ప్రాచుర్యం పొందింది. దీని గురించి ఇప్పటికే ప్రపంచంలోని అగ్రపత్రికలన్నీ ఇప్పటికే ప్రచారం చేశాయి.

ఇకపోతే ప్రతిష్ఠాత్మక లండన్‌ మ్యాగజైన్‌ గార్డియన్‌లో బాహుబలి మేకింగ్‌, రామోజీ ఫిలింసిటీ గురించిన ఆర్టికల్‌ వచ్చింది ఇటీవలి కాలంలో. ఇలా బాహుబలి గురించి ఎంత చెప్పినా ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది.

Tags:    

Similar News