సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీకి ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరుండేది. కానీ వరస ఫ్లాపులతో ఆ ట్యాగ్ కాస్తా తుడిచిపెట్టుకుపోయింది. ఈమధ్య మళ్ళీ కృష్ణవంశీ తన కెరీర్లో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరాఠీలో సూపర్ హిట్ అయిన 'నటసమ్రాట్' సినిమాను తెలుగులో ప్రకాష్ రాజ్ తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈమధ్య వార్తలు కూడా వచ్చాయి.
కానీ ఎందుకో ఆ రీమేక్ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదట. దీంతో కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ తన భర్తకు సపోర్ట్ ఈ ప్రాజెక్టును సెట్ చేసేందుకు ముందుకు వచ్చిందట. రమ్యకృష్ణ కు అక్కినేని నాగార్జున మంచి స్నేహితుడు. నాగార్జున నటించిన చాలా సినిమాలలో రమ్యకృష్ణ గతంలో హీరోయిన్ గా నటించింది. అంతెందుకు 'సోగ్గాడే చిన్ని నాయన' లో బంగార్రాజు పాత్రకు జోడీ రమ్య అని తెలిసిందే కదా. ఈ ఫ్రెండ్షిప్ తోనే కృష్ణ వంశీకి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వాల్సిందిగా నాగార్జునను రిక్వెస్ట్ చేసిందట.
అయినా కృష్ణవంశీ - నాగార్జున కాంబినేషన్లో 'నిన్నే పెళ్లాడతా' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కింది. మరి రమ్య రికమెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మీకు అనుమానం రావచ్చుగానీ కృష్ణవంశీ-నాగ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'చంద్రలేఖ' సినిమా రిలీజ్ తర్వాత వారిద్దరి మధ్యలో విభేదాలు వచ్చాయట. అందుకే వారు మళ్ళీ కలిసి పనిచేయలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే రమ్య సీన్ లో కి ఎంటర్ అయి నాగ్ తో మాట్లాడిందట. మరి నాగార్జున ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి. అసలే వర్మ 'ఆఫీసర్' తో గట్టి దెబ్బ తిని ఉన్న నాగ్ పూర్తిగా అవుట్ డేట్ అయిన కృష్ణవంశీకి ఛాన్స్ ఇస్తాడనుకోవడం అత్యాశే.