భ‌ర్త ఇచ్చిన టాస్క్ పూర్తి చేసిన శివ‌గామి!

Update: 2022-10-28 14:30 GMT
బాహుబ‌లితో శివ‌గామిగాద పాపులారిటీని సొంంత చేసుకున్న ర‌మ్య‌కృష్ణ మ‌ళ్లీ సినిమాల్లో త‌న జోరు చూపిస్తున్నారు. ఇటీవ‌ల రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `లైగ‌ర్` సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ర‌మ్య‌కృష్ణ కొన్నేళ్ల విరామం త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ తో క‌లిసి `జైల‌ర్‌` మూవీలో న‌టిస్తోంది. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మార‌న్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

షూటింగ్ ద‌శ‌లో వున్న ఈ మూవీలో క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇదిలా వుంటే ప‌లు టీవీ షోల్లోనూ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తూ బిజీగా వున్న రమ్య‌కృష్ణ భ‌ర్త‌, ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న `రంగ‌మార్తండ‌`లోనూ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌, ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం, అన‌సూయ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

`న‌క్ష‌త్రం` వంటి డిజాస్ట‌ర్ త‌రువాత దాదాపు నాలుగేళ్ల విరామం అనంత‌రం కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. మ‌రాఠీ మూవీ `న‌ట్‌ స‌మ్రాట్‌` ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా కొంత కాలం మ‌ధ్య‌లో ఆగిపోయిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తి కావ‌డంతో కృష్ణ‌వంశీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు.

ఇటీవ‌లే కీల‌క పాత్ర‌ల డ‌బ్బింగ్ వ‌ర్క్ మొద‌లైంది. ప్ర‌కాష్ రాజ్ త‌న పోర్ష‌న్ ని పూర్తి చేయ‌గా అనంత‌రం హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. కామెడీ కింగ్ అయిన బ్ర‌హ్మానందం ఈ మూవీలో అత్యంత కీల‌కంగా సాగే సీరియ‌స్ పాత్ర‌లో కంట‌త‌డి పెట్టించ‌నున్నాడ‌ట‌. వీరితో పాటు ర‌మ్య‌కృష్ణ కూడా ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. శుక్ర‌వారం త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం పూర్తి చేశారామె.

మ‌హేష్ మంజ్రేక‌ర్ డైరెక్ష‌న్ లో విల‌క్ష‌ణ న‌టుడు నానా ప‌టేక‌ర్ న‌టించిన మరాఠీ మూవీ `న‌ట్ స‌మ్రాట్‌` ఆధారంగా `రంగ‌మార్తాండ‌`ని రీమేక్ చేస్తున్నారు. నానా ప‌టేక‌ర్ పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. నాలుగేళ్ల విరామం త‌రువాత చేస్తున్న ఈ మూవీపై కృష్ణ వంశీ భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ కృష్ణ వంశీ అంచ‌నాల్ని ఏ మేర‌కు అందుకుంటుందో వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News