కన్నడ హీరోయిన్ రమ్య.. ఈ పేరు రెండు రకాలుగా అందరికీ తెలుసు. ఒకటి సినీనటి రమ్య, రెండు రాజకీయనేత రమ్య. ఈ రెండు విభాగాల్లోనూ సక్సెసైంది. స్టార్ గా కన్నడ పరిశ్రమని ఓ దశాబ్ధం పాటు ఏలింది. అతి పిన్న వయసులో ఎంపీ అయ్యి సంచలనం సృష్టించిన నటిగా పేరు తెచ్చుకుంది రమ్య నంబీషన్. మాంధ్య నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గింది. అయితే రెండో టెర్మ్ ఎన్నికల్లో ఓటమి పాలైంది. దాంతో శత్రువులు ఊరు వదిలి వెళ్లిపోయిందంటూ ప్రచారం సాగించారు.
కట్ చేస్తే... రమ్య తిరిగి బెంగళూరులో అడుగుపెట్టి ఒక్కో చిక్కుముడి విప్పడం మొదలు పెట్టింది. ముందుగా అమెరికా నుంచి వచ్చిన వెంటనే ప్రజ్వల్ దేవరాజ్ సరసన ఓ సినిమాలో నటించే పనిలో పడింది. సేమ్ టైమ్ ఇటీవలే మాంధ్య నియోజకవర్గంలో ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లింది. అక్కడికి బ్యాండేజీ కట్టుకున్న కాలుతోనే నడిచి వెళ్లింది. ఇంతకాలం రమ్య ఏమైపోయింది? అనుకున్నవారికి ఒకటే సమాధానం వినిపించింది. రమ్య అంటే ఆడపులి. పిల్లి కాదు. రాజకీయాల్లోకి తిరిగి వస్తోంది. కత్తి చేపట్టిన రుద్రమదేవిలా విరుచుకుపడబోతోంది.. అని అర్థమైంది. రాజకీయాల కోసం అడ్మినిస్ట్రేషన్ విద్యలో రాటు దేలడానికి అమెరికా వెళ్లింది. అదీ సంగతి.