తమిళ యువ దర్శకులలో ముందువరుసలో కనిపించే జాబితాలో నెల్సన్ దిలీప్ కుమార్ ఒకరుగా కనిపిస్తాడు. 'బీస్ట్' సినిమాకి ముందు ఆయన చేసినవి రెండే సినిమాలు. ఒకటి 'కొలమావు కోకిల' కాగా .. మరొకటి 'డాక్టర్'. ఈ రెండు సినిమాలు కూడా ఒక మాదిరి బడ్జెట్ తో రూపొందిన సినిమాలే. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఈ రెండు సినిమాలు కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. చాలా తక్కువ బడ్జెట్ లో శివకార్తికేయన్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'డాక్టర్' 100 కోట్ల వసూళ్లను రాబట్టింది.
నెల్సన్ లోని ఈ టాలెంట్ ఆయనకి విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ ను తెచ్చిపెట్టింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విజయ్ క్రేజ్ కి తగినట్టుగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
బలమైన స్క్రీన్ ప్లే లేకపోవడం ఈ సినిమాను దెబ్బ కొట్టేసింది. అయితే నెల్సన్ సన్ పిక్చర్స్ వారితో ఎక్కువగా ఖర్చు పెట్టించలేదు. ఒక షాపింగ్ మాల్ తీసుకుని దాని చుట్టూ కథ అల్లుకున్నాడు. అందువలన బడ్జెట్ మాల్ దాటేసి బయటికి పెద్దగా వెళ్లలేదు. ఈ కారణంగా నష్టాలు రాలేదు.
ఈ కారణంగానే నెల్సన్ తో మరో సినిమాను చేయడానికి సన్ పిక్చర్స్ వారు ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కెరియర్ పరంగా రజనీకి ఇది 169వ సినిమా. 'బీస్ట్' కారణంగా అసంతృప్తితో ఉన్న అభిమానులను ఈ సారి తప్పకుండా ఖుషీ చేయాలనే ఉద్దేశంతో నెల్సన్ ఉన్నాడు. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచించిన ఆయన, బలమైన లేడీ విలన్ పాత్రను రాసుకుని, ఆ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నాడని అంటున్నారు.
రజనీకాంత్ - రమ్యకృష్ణ కాంబినేషన్లో 1999లో వచ్చిన 'నరసింహా' ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన 'నీలాంబరి' పాత్ర రమ్యకృష్ణ కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచింది.
అలాంటి ఒక పవర్ఫుల్ పాత్రను క్రియేట్ చేసిన నెల్సన్, ఆ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నాడని అంటున్నారు. దీంతో మరోసారి 'నరసింహా' హిస్టరీ రిపీట్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల్సన్ తీసుకున్న నిర్ణయమైతే అదరహో అన్నట్టుగానే ఉంది. కాకపోతే ఆయన దృష్టి పెట్టవలసింది .. స్క్రీన్ ప్లే పైన. ఆ విషయంలో ఏం చేస్తాడో చూడాలి మరి.