రాజమాత శివగామిగా `బాహుబలి` చిత్రంలో నటించి సర్ ప్రైజ్ చేశారు రమ్యకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత ఈ సీనియర్ నటి కెరీర్ కి ఎదురే లేకుండా పోయింది. క్షణం తీరిక లేనంతగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వెబ్ సిరీస్ లతో రమ్యకృష్ణ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తండలో నటిస్తున్నరు. మరాఠా బ్లాక్ బస్టర్ నట సామ్రాట్ సినిమాకి రీమేక్ ఇది. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్వీన్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. నీలాంబరిగా.. అమ్మోరిగా.. శివగామిగా విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ జయలలిత పాత్రలోనూ గొప్పగా నటించి మెప్పించారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ- లైగర్ సహా సాయితేజ్-దేవకట్టా రిపబ్లిక్ సినిమాలోనూ నటిస్తున్నారు. ఇక తమిళంలో టీవీ షోల వ్యాఖ్యాతగా.. సీరియల్స్ నటిగానూ రాణిస్తున్నారు. ఇక 50 ఏజ్ లోనూ రమ్య అందచందాలు ఏమాత్రం తగ్గలేదు. కె.రాఘవేంద్రరావు చిత్రాల్లో నవనాయికలా ఇప్పటికీ అదే రూపంతో అలరిస్తున్నారు.
ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న రమ్యకృష్ణ రోజుకు ఎంత పారితోషికం అందుకుంటోంది? అంటే... రోజుకు రూ.10లక్షల పారితోషికం అందుకుంటున్నారని తెలిసింది. అంటే పది రోజులకు కోటి పారితోషికం. ఒక అగ్ర నాయిక ఒక్కో సినిమాకి కోటి నుంచి 3కోట్లు తీసుకుంటుంటే రెండు నెలల కాల్షీట్లు కేటాయించాలి. కానీ రమ్యకృష్ణ కేవలం రోజుల వ్యవథిలోనే అంత పెద్ద మొత్తాన్ని ఆర్జిస్తున్నారన్నమాట.