నంద‌మూరి మామ‌- నారా అల్లుడు

Update: 2018-09-13 04:37 GMT
అస‌లు ఆ ర‌హ‌స్య మంత‌నాలేంటో.. మామా అల్లుళ్ల ర‌హ‌స్య మంత‌నాలు జ‌నాల్ని క‌న్ఫ్యూజ్ చేస్తున్నాయ్‌! ఆ చిమ్మ చీక‌టిలో క్రీనీడలో ర‌హ‌స్య కోట‌లాంటి ఆ ఇంట్లో నిశీధిలో నిశ్శ‌బ్ధాన్ని చీల్చుతూ అస‌లేం మాట్లాడుకుంటున్నారో?

అల్లుడికి క‌ర్త‌వ్యం భోధిస్తున్నారా?  రాజ‌కీయాల్లో ఎలా ఉండాలో నేర్పిస్తున్నారా?  రాజ‌కీయం ఒక ర‌ణం లాంటిద‌ని, ర‌ణ‌క్షేత్రంలో ఎత్తు పైఎత్తు వేయ‌డం త‌ప్ప‌ద‌ని ఉద్భోధిస్తున్నారా?  సంథింగ్ ఏదో కీల‌క ప‌రిణామ‌మే. తెలుగువాళ్ల‌ను - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ను ద‌శాబ్ధాల పాటు ముఖ్య‌మంత్రిగా పాలించిన నంద‌మూరి తార‌క‌రామారావు త‌న క్యాబినెట్ లో అల్లుడు చంద్ర‌బాబుకు చోటిచ్చారు. ఆ క్ర‌మంలోనే అర్థ‌శాస్త్ర నిపుణుడైన చంద్ర‌బాబుకు రాజ‌కీయాల్లో ఎన్నో కీల‌క‌మైన కిటుకుల్ని నేర్పించార‌ని చెబుతారు. ఇక వృత్తిగ‌తంగానే కాదు, వ్య‌క్తిగ‌తంగానూ ఆ ఇద్ద‌రి మధ్యా ఎంతో సాన్నిహిత్యం ఉంది. కాల‌క్ర‌మంలో రాజ‌కీయాలు మారాక స‌న్నివేశం మారిందే కానీ, అంత‌కుముందు ఆ ఇద్ద‌రూ ఒక‌టే. అల్లుడు హిత‌వు కోరుకుని ఎన్టీఆర్ ఎంతో చేశారన్న‌ది వాస్త‌వం.

వినాయ‌క చ‌వితి కానుక‌గా `ఎన్టీఆర్` చిత్రంలోంచి మ‌చ్చు తున‌క‌ లుక్ ఒక‌టి తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. నంద‌మూరి మామ‌- నారా అల్లుడుగా నంద‌మూరి బాల‌కృష్ణ - ద‌గ్గుబాటి రానా కాంబినేష‌న్ క్యా సీన్ హై! అన్న చందంగా ఉంది. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి మ‌రిన్ని క్యారెక్ట‌ర్ల‌ను క్రిష్ రివీల్ చేస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News