'భీమ్లా నాయక్' కు కౌంటర్ ఇస్తే పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా?

Update: 2021-08-18 03:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''భీమ్లా నాయక్''. మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటుగా పవన్ పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ చిన్న వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో మల్టీస్టారర్ చిత్రానికి ఒక హీరో పాత్ర పేరునే పెట్టడంపై దగ్గుబాటి ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రంలో ఇద్దరు హీరోల పాత్రలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఇద్దరి పేర్లు వచ్చేలా టైటిల్ పెట్టారు. కానీ తెలుగులో మాత్రం పవన్ నటిస్తున్న 'భీమ్లా నాయక్' పేరుని టైటిల్ గా పెట్టి.. ఇది సోలో హీరో సినిమా అనుకునేలా ప్రమోషనల్ కంటెంట్ వదిలారు. అలానే గ్లిమ్స్ లో 'బయటకు రారా నా కొ*కా' వంటి డైలాగ్స్ ఉండటంతో పవన్ డామినేషన్ గట్టిగానే ఉంటుందని సినీ అభిమానులు ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కోసం రానా పాత్రను కావాలనే తగ్గించి ఉండవచ్చనే కామెంట్స్ కూడా చేశారు.

ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' నిర్మాత సూర్య దేవర నాగ వంశీ దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అప్పుడే ఒక నిర్ధారణకు రావొద్దని.. ఏ విషయమైనా సరే ఒక్కొక్కటిగా మెల్లగా బయటకు వస్తుందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ తగ్గలేదు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా రానా పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. అది కూడా 'భీమ్లా నాయక్' కు కౌంటర్ గా.. అదే తరహా డైలాగ్స్ తో రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

'భీమ్లా నాయక్' చిత్రంలో డానియల్ శేఖర్ అనే పాత్రలో రానా దగ్గుబాటి కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ పాత్రకు ధీటుగానే ఉంటుందని అంటున్నారు. రానా టీజర్ తో నెగిటివ్ ప్రచారానికి చెక్ పెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శక నిర్మాతలు దీనిపై చర్చిస్తున్నట్లు టాక్. ఒకవేళ పవన్ పాత్రకు కౌంటర్ గా 'రారా నా కొ*కా' అనే రేంజ్ లో ఈ టీజర్ ఉంటే.. పవర్ స్టార్ అభిమానులు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.

కాగా, 'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ వరకు చూసుకుంటున్నారు. ఇందులో నిత్యామీనన్ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News