లగ్న పత్రికలు పంచుకున్న 'రానా - మిహీక' కుటుంబాలు!

Update: 2020-06-22 14:00 GMT
రానా దగ్గుబాటి కాబోయే భార్య మిహీకా బజాజ్.. రెండు కుటుంబాల మధ్య ఇటీవల జరిగిన ఒక వేడుక నుండి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వేడుక ఏమిటో అని పెద్దగా ఆలోచించకండి.. సెలెబ్రిటీలకు స్టైలిస్ట్ అయిన మిహీక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బిజీగా ఉందని ఇలా చెప్తుంది. ఇటీవలే వధువు ఇంట్లో ‘లగ్న పత్రికలు’ కార్యక్రమంతో ఇరు కుటుంబాలు వివాహానికి మరింత దగ్గరలో ఉన్నాయి. ఈ వేడుకలో ఒకరికొకరు లగ్న పత్రికలు పంపిణీ ప్రారంభించారు. అంతేగాక ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఇటు దగ్గుబాటి అటు బజాజ్ కుటుంబాలలో పూర్తి స్థాయి వేడుకల వాతావరణం కనిపిస్తుంది. ఇంకా సాంప్రదాయ దుస్తులతో పాటు అందమైన ఆభరణాలను ధరించిన మిహీక తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయని సూచించింది.

ఆమె తన ఫోటోలు షేర్ చేస్తూ.. “వేడుకలు హ్యాపీగా జరుగుతున్నాయి. నా రోజును మరింత ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు!” అంటూ పోస్ట్ లో మెన్షన్ చేసింది. అయితే పెళ్లికొడుకు రానా ఫోటోలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఇక ఈ జంట ఆగస్టు 8న ఫలక్నుమా ప్యాలెస్‌లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయట. పెళ్లి తేదీలో ఎటువంటి మార్పు ఉండదని రానా తండ్రి సురేష్ బాబు ఇదివరకే తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. అంతేగాక ఇరు కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు.. నిబంధనలకు కట్టుబడి పెళ్లి జరుపబోతున్నామని తెలిపారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గ్రూప్ నుండి దగ్గుబాటి రానా తప్పుకుంటున్నట్లే అని సినీ వర్గాలు.. అభిమానులు తెగ వార్తలు మోస్తున్నారు.
Tags:    

Similar News