రానాతో ఫైవ్‌ స్టార్‌ ఫుడ్‌ తినాలనుంటే..

Update: 2015-08-20 09:18 GMT
సామాజిక దృక్పథంలో హీరోయిన్‌ లే కాదు. హీరోలు కూడా ముందుంటున్నారు! సోషల్‌ వర్క్‌ లో సమంత - హన్సిక - కాజల్‌ ఆల్‌ టైమ్‌ హాట్‌ టాపిక్‌. పవన్‌ - మహేష్‌ - చరణ్‌ - బన్ని - రానా .. ఇలా స్టార్‌ హీరోలంతా అపుడో ఎపుడో మంచి పనులు చేసినవాళ్లే. సునామీ, పెను తుఫాన్‌ లు విరుచుకుపడినప్పుడు తమ వంతుగా ఆర్థిక, హార్థిక సాయం చేసి ఆదర్శం అనిపించుకున్నారు. ఇప్పుడు అలాంటి ఓ సత్కార్యానికి భళ్లాలదేవ రానా సిద్ధమవుతున్నాడు.

అతడి ఫేస్‌ బుక్‌ పేజీ లో ఈరోజు ఓ ఆసక్తికర విషయాన్ని పోస్ట్‌ చేశాడు. బాలల హక్కుల్ని పరిరక్షించి, బంగారు భవిష్యత్‌ కు మీ వంతు ఆర్థిక సాయాన్ని అందించండి అంటూ ఓ కాంటెస్టుని పోస్ట్‌ చేశాడు. క్రై (చిల్డ్రన్‌ రైట్స్‌ అండ్‌ యు) అనే చారిటీ సంస్థకు బాసటగా నిలిచి ఆర్థికసాయాన్ని చేయాల్సిందిగా కోరాడు. 'విన్‌ విన్‌' ఆర్గనైజేషన్‌ ద్వారా ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే వారికి నాతో పాటే కూచుని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ లో డిన్నర్‌ చేసే అవకాశాన్ని ఇస్తున్నానని అన్నాడు. అలాగే భళ్లాలదేవ డైలాగుల్లోంచి కొన్నిటిని డబ్‌ స్మాషనలో పంపిస్తే విన్‌ అయినవారికి నా ఫేవరెట్‌ పెర్ఫ్యూమ్‌ ని ఇస్తానని ప్రామిస్‌ చేశాడు. రానాతో ఫైవ్‌ స్టార్‌ ఫుడ్‌ తినాలని లేకపోయినా, ఓ మంచి పనికోసం ఆర్థికసాయాన్ని మాత్రం మర్చిపోకండి ప్లీజ్‌!
Tags:    

Similar News