ప్రతి హీరో కెరీర్లో హిట్లు ఫ్లాపులు ఉంటాయి. మెగాస్టార్లు.. సూపర్ స్టార్లు కూడా ఫ్లాపులను తప్పించుకోలేరు. ఇక రామ్ గోపాల్ వర్మ విషయం తీసుకుంటే 'శివ' లాంటి క్లాసిక్ ఫిలిమ్స్ నుండి ఆఫీసర్ లాంటి బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ల వరకూ అన్నీ చూశాడు. జనాలు చూడడానికి జడుసుకునే కళాఖండాలను ఎన్నో సృజించారాయన. ఇక ఒక్కోసారి ఆయన క్రియేటివిటీ దెబ్బకు వెండితెర కూడా షాక్ తింటుంది. అలాంటి వాటిలో 'డిపార్ట్ మెంట్' ఒకటి.
ఈ సినిమా గురించి రానా దగ్గుబాటి రీసెంట్ గా 'నెంబర్ 1 యారీ' కార్యక్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఈ సినిమాలో రానా హీరోగా నటించిన సంగతి తెలిసిందే. రానా ఈ సినిమా గురించి మాట్లాడుతూ 'లీడర్' తర్వాత 'డిపార్ట్ మెంట్' లో అవకాశం వచ్చిందట. అమితాబ్ బచ్చన్.. సంజయ్ దత్.. అభిమన్యు సింగ్ లాంటి నటులు.. పైగా హిందీ సినిమా కావడంతో రానా ఫుల్ గా ఎగ్జైట్ అయ్యాడట. కానీ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్ డైరెక్టర్ వర్మతో మాట్లాడుతూ "వర్మాజీ.. ఈ సినిమాను రిలీజ్ తర్వాత మీరు.. మీ ఆఫీస్ బాయ్.. అతను(ఎదురుగా ఉండే మరో వ్యక్తిని చూపిస్తూ).. మీ ముగ్గురే చూస్తారేమో" అని కామెంట్ చేశాడట. బిగ్ బీ కామెంట్ షాకింగ్ గా అనిపించిందని..కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత అయన చెప్పినట్టే సినిమా ఫ్లాప్ అయిందని తెలిపాడు.
ఆ సినిమాను వర్మ కూడా చూసి ఉండడేమో అని అభిప్రాయపడ్డాడు రానా. అంతే కాదు తనకు బాలీవుడ్లో పెద్ద షాక్ ఇచ్చిన సినిమా 'డిపార్ట్ మెంట్' అని ఓపెన్ గా ఒప్పేసుకున్నాడు. హిట్టో ఫ్లాపో.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడం అనేది ఏ నటుడికైనా ఒక మెమరీ. రానాకు చేదు జ్ఞాపకంగా మిగిలింది అంతే.