తేజ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. సినిమా టైటిల్ దగ్గర్నుంచే కొత్తదనం ప్రదర్శించే దర్శకుల్లో ఆయన ఒకరు. ఆ ప్రయత్నాలన్నీ తొలినాళ్లల్లో సత్ఫలితాల్నే ఇచ్చాయి. కానీ ఈమధ్యే ఏం చేసినా విజయం మాత్రం ఆయన దరి చేరడం లేదు. తేజ మాత్రం పట్టిన పట్టు వీడడం లేదు. మళ్లీ మళ్లీ దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే రానా - కాజల్ లని ఒప్పించి ఓ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో ఆ చిత్రం తెరకెక్కుతోందని ప్రచారం సాగుతోంది. మరి అందులో నిజమెంతన్నది తేజనే చెప్పాలి.
అయితే ఆ సినిమాకి ఫిక్సయ్యిందంటూ `నేనే రాజు నేనే మంత్రి` అనే పేరు వినిపిస్తోంది. తేజ తన సంస్థపై ఈ పేరుని రిజిస్టర్ చేయించారట. దీన్నిబట్టి అది రానా - కాజల్ లతో తెరకెక్కిస్తున్న సినిమా కోసమే అయ్యుంటుందని ఫిల్మ్ నగర్ జనాలు అంచనా వేస్తున్నారు. ఇందులో రానా - కాజల్ లతో పాటు కేథరిన్ కూడా నటిస్తోంది. కాంబినేషన్ అయితే ఆకట్టుకొనేలానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. తేజ మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈసారి గురి తప్పదని తన సన్నిహితులతో చెబుతున్నాడట. అదే జరిగితే తెలుగు ఇండస్ట్రీకి అంతకంటే ఏం కావాలి? తేజలాంటి దర్శకులు ఫామ్ లోకి వస్తే యేడాదికి ఆయన్నుంచి ఒకట్రెండు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకొస్తాయి. సో.. తేజకి విజయం దక్కాలని ఆశిద్దాం!