అజ్ఞాతవాసిని అతను సెటిల్ చేశాడట

Update: 2018-01-06 17:13 GMT
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రాన్ని కాపీ వివాదం చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ను త్రివిక్రమ్ కాపీ చేశాడనే ఆరోపణలు వినిపించాయి. ఈ సినిమాను ఇండియన్ లాంగ్వేజెస్ లో రీమేక్ చేసేందుకు హక్కులు కలిగి ఉన్న టీ సిరీస్ సంస్థ.. చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కూడా భావించిటన్లు న్యూస్ వచ్చాయి. ఇప్పుడీ వివాదం ముగిసిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం అసలు ఎలా సెటిలైంది?

నిజానికి హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ కు మధ్య ఒప్పందం కుదిరిందట. కేసులు పెట్టే యోచనను.. కోర్టుకు వెళ్లాలనే ఆలోచనను టీ సిరీస్ విరమించుకుందని తెలుస్తోంది. దానంతటికీ కారణం హీరో రానా దగ్గుబాటి అంటున్నారు. దీంతో ఇప్పుడు అజ్ఞాతవాసికి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లు అయింది. నిజానికి ఫ్రెంచ్ మూవీని త్రివిక్రమ్ యథాతథంగా తీసుకోలేదని.. కొన్ని సీక్వెన్స్ లను మాత్రమే స్ఫూర్తిగా తీసుకున్నాడని చెబుతున్నారు. దీంతో కోర్టుకు వెళ్లినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదని భావించిందట ఆ సంస్థ. అందుకే రానా చేసి దౌత్యంతో కొంత డబ్బులు తీసుకుని కామ్ అవ్వడానికే నిర్ణయించుకున్నారట.

అయితే ఈ ఎమౌంట్ ఎంత అనేది ఎవ్వరికీ తెలియదు. కొంతమంది 5 కోట్లకు మ్యాటర్ సెటిలైంది అంటే.. కొందరు ఫ్రీగా సెటిలైంది అంటున్నారు. అలాగే ఇంకొంతమంది మాత్రం అసలు ఈ సెటిల్మెంట్ కు రానా దగ్గుబాటికీ సంబంధం లేదు అని కూడా చెబుతున్నారు. నిజమేంటో ఎవ్వరికీ తెలియదు కాని.. అసలు త్రివిక్రమ్ కాపీ కొట్టేసి అలా ఎలా దొరికిపోయాడు అనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News