ఫస్ట్ లుక్: కోపోద్రిక్తుడైన భల్లాలదేవ!!

Update: 2016-12-14 07:34 GMT
హీరో రానా దగ్గుబాటి తొలిసారిగా నెగెటివ్ రోల్ చేసినా కూడా.. ''బాహుబలి'' సినిమాలో తన అత్యంత క్లాసిక్ ప్రదర్శనతో భయంకరమైన క్రూరుడు భల్లాలదేవగా అందరినీ ఆకట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ టాలెంటెడ్ హీరోకు 32వ జన్మదిన శుభాకాంక్షలను చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు.

ఎవ్వరూ ఊహించని రీతిలో ఇప్పుడు ''బాహుబలి 2'' సినిమా నుండి రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు రాజమౌళి. అదిగో వస్తున్నా అరివీరభయంకరుడు అంటూ మనోడు ఈ లుక్ ను రిలీజ్ చేయడం విశేషం. గతంలో బాహుబలి 1 పోస్టర్లలో రానా తాలూకు యంగ్ లుక్ ను చూపిస్తే.. ఈసారి బాహుబలి కొడుకు శివుడుతో తలబడే సీనియర్ రానా దగ్గుబాటిని పోస్టర్ పై ఆవిష్కరించారు. కండల్లో శూరత్వం.. చూపుల్లో క్రూరత్వం.. కోపోద్రిక్తుడైన భల్లాలదేవ.. కట్టప్ప అసలు బాహుబలిని ఎందుకు చెప్పాడో తెలిపే కథలో.. తన వంతు రచ్చ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. మీరు కూడా రెడీగా ఉండండి.

ఏప్రియల్ 2017లో బాహుబలి 2 సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News