భల్లాలదేవుడు రాణా హీరోగా తేజ దర్శకత్వం వహించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా తెలుగులో మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత తేజకు ఈ చిత్రం చెప్పుకోదగ్గ విజయాన్ని తెచ్చిపెట్టింది. బాహుబలి తర్వాత రాణాకు విపరీతమైన క్రేజ్ రావడంతో నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదల చేశారు. అయితే, ఈ చిత్రానికి తమిళంలో ఆశించినంత ఆదరణ లభించలేదు. అయితే, తాజాగా రాణా తన అదృష్టాన్ని మలయాళంలో పరీక్షించుకోబోతున్నాడు.
తెలుగులో ఘనవిజయం సాధించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం తమిళ తంబీలకు పెద్దగా రుచించలేదు. ఘాజీ, బాహుబలి తరహాలోనే ఈ చిత్రానికి ఆదరణ లభిస్తుందని ఆశించిన రాణా భంగపడ్డాడు. అయితే, తాజాగా ఈ సినిమాను కేరళలో శుక్రవారం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘రాజ కిరీడం’ పేరుతో నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేయబోతున్నారు. కొద్దో గోప్పో పేరున్న కోలీవుడ్ లోనే రాణాకు చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో, ఈ సినిమాను మలయాళ ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.