ఫోటో స్టోరీ: సెక్సీ భామలతో రానా పోజులు

Update: 2017-12-17 07:23 GMT
‘బాహుబలి’.. ‘ఘాజీ’ లాంటి సినిమాలతో గత కొన్నేళ్లలో తన ఇమేజ్ ను తిరుగులేని స్థాయికి తీసుకెళ్లాడు దగ్గుబాటి రానా. నేషనల్ లెవెల్లో అతను పాపులర్ ఫిగర్ ఇప్పుడు. తన పాపులారిటీని సరిగ్గా ఉపయోగించుకుంటూ ఫ్యాషన్ ఐకాన్ గానూ అవతరించాడు రానా. తనకు గుర్తింపు వస్తున్న సమయంలోనే ట్రెండీ ఫొటో షూట్లు చేస్తూ.. ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొంటూ తన ఇమేజ్ మరింతగా బిల్డ్ చేసుకున్నాడు. ఇంతకుముందు నటాలియా కౌర్ తో రానా చేసిన ఒక ఫొటో షూట్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వరస కొనసాగిస్తూ తాజాగా మరో సెక్సీ ఫొటో షూట్ చేశాడు రానా.

‘మాగ్జమ్’ మ్యాగజైన్ కోసం అతను ఇద్దరు హాట్ మోడల్స్ తో కలిసి ఇచ్చిన పోజులు జనాల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఆ ఇద్దరు భామలూ ఓ రేంజిలో అందాలు ఆరబోస్తున్నారు. రానా జెంటిల్మెన్ లుక్ లో కనిపిస్తున్నాడు. బ్లాక్ అండ్ వైట్ లుక్ ఈ షూట్ కు మరింత అందం తెచ్చిపెట్టింది. ఈ షూట్ తాలూకు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రానా సినీ కెరీర్ విషయానికొస్తే.. చాలా విభిన్నమైన.. క్రేజీ ప్రాజెక్టులు అతడి చేతిలో ఉన్నాయి. ‘1945’ అనే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను పూర్తి చేస్తున్న రానా.. ‘హాథీ మేరీ సాథి’ అనే సినిమాను ఓకే చేశాడు. తమిళంలో అతను రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.

Tags:    

Similar News