అక్కినేని వంశానికి లేటెస్ట్ తరం వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు అఖిల్. తన తొలి చిత్రం అఖిల్ కి గాను బెస్ట్ డెబ్యూగా పలు అవార్డులు అందుకుంటున్న ఈ అక్కినేని హీరో.. సైమా ఫంక్షన్ లో కూడా ఈ అవార్డు తీసుకున్నాడు. స్టేజ్ పై ఈ అవార్డు తీసుకుని స్పీడ్ గా వెళ్లిపోతున్న అఖిల్ కి.. అనుకోని విధంగా సమస్య ఎదురైంది. ఆ ప్రాబ్లెమ్ పేరే దగ్గుబాటి రానా. ప్రస్తుతం అఖిల్ కి ఎంగేజ్మెంట్ జరగబోతోందంటూ వస్తున్న వార్తలను బేస్ చేసుకుని.. ఈ డెబ్యూ హీరోని ఆ బెస్ట్ విలన్ ఆట పట్టించేశాడు.
'నీ ఏజ్ ఎంత బంగారం' అంటూ అఖిల్ ని అడిగాడు రానా. దీనికి సమాధానం చెప్పేందుకు కొంత ఇబ్బంది పడ్డ అఖిల్.. 22 అని ఆన్సర్ ఇచ్చాడు. 'నన్ను చూడు నాకు ఇప్పుడు 32 సంవత్సరాలు. ఇప్పటివరకూ పెళ్లి గురించి ఆలోచించలేదు తెలుసా? అక్కడున్న బన్నీని చూడు. పెళ్లి చేసుకున్న రోజు నుంచి మా ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోయాడు. నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ ని మర్చిపోతావా?' అంటూ క్వశ్చన్ చేయడంతో అఖిల్ తెగ ఇబ్బంది పడిపోయాడు.
దీన్ని తప్పించుకునేందుకు.. 'కానీ మీరు నా ఫ్రెండ్ కాదు కదా. మీరు నా స్నేహితుడా' అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అక్కినేని అబ్బాయి తెలివితేటలకు.. భల్లాలదేవుడు కూడా భళ్లున నవ్వేశాడు. మొత్తానికి అఖిల్ పెళ్లి వార్తలను అడ్డం పెట్టుకుని.. సైమా స్టేజ్ పై నవ్వులు పూయించేశాడు రానా.