మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనమ్ కోషియం (AK) తెలుగు రీమేక్ లో పవన్ కల్యాణ్ -రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. బిజు మీనన్- పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను రీప్లేస్ చేస్తున్నారు. ఈ సినిమాని ఇంతకుముందు సితార సంస్థ అధికారికంగా ప్రకటించింది.
తాజాగా అరణ్య రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా రానా ఈ రీమేక్ గురించిన పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ చిత్రం తెలుగు వారికి బాగా కనెక్టవుతుంది. మలయాళ వెర్షన్ కంటే అద్భుతంగా ఉంటుంది. తెలుగు సంస్కృతిని పూర్తిగా సినిమాలోకి తెచ్చాం. పెద్ద ఎలివేషన్ ఉంటుంది. ప్రతి రోజు సినిమా షూటింగ్ సరదాగా ఉంటోంది`` అని రానా వెల్లడించారు. ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగులో డైలాగ్స్ డ్రామా అధికంగా ఉండేలా మన కల్చర్ కి తగ్గట్టు మార్చమాని తెలిపారు.
పవన్ ఇందులో పోలీసాఫీసర్ గా నటిస్తుంటే.. ఆల్కహాల్ సేవించే పెద్ద మనిషిగా రానా కనిపించనున్నాడు. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో ఎస్ నాగవంశీ నిర్మిస్తున్నారు.