విరాట పర్వం మొదలైంది

Update: 2019-06-15 06:41 GMT
నీది నాది ఒకే కథతో టిపికల్ కాన్సెప్ట్ ని తెరకెక్కించిన తీరుకి ప్రశంశలు వసూళ్లు ఘనంగా అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల రెండో సినిమా విరాట పర్వం షూటింగ్ ఇవాళ లాంచనంగా మొదలైంది. వెంకటేష్ తొలి క్లాప్ కొట్టగా ఎమెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దివాకర్ మణి ఛాయాగ్రహణం సురేష్ బొబ్బిలి సంగీతం ఇందులోని కీలక సాంకేతిక వర్గం. మిగిలిన వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

సురేష్ బాబుతో పాటు సుధాకర్ చెరుకూరి సంయుక్త నిర్మాతలుగా వ్యవహరించే విరాట పర్వం సురేష్ ప్రొడక్షన్స్-శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై రూపొందుతుంది. వచ్చే వారం నుంచే రెగ్యులర్ షూటింగ్ జరపబోతున్నారు. ఇవాళ వేడుకకు పలువురు దర్శకులు నిర్మాతలు హాజరై టీంకు విషెస్ చెప్పారు. విరాట పర్వం గురించిన వార్తలు గత ఆరు నెలల నుంచే ప్రచారంలో ఉన్నాయి. రానా బిజీగా ఉండటం సాయి పల్లవికి కమిట్ మెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఫైనల్ గా ఇప్పుడు కొలిక్కి వచ్చింది.

90వ దశకంలో జరిగిన రాజకీయ పరిస్థితులను నేపధ్యంగా తీసుకుని పొలిటికల్ థ్రిల్లర్ గా వేణు ఊడుగుల దీన్ని రూపొందిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. చాలా బలమైన సెటైర్లతో పాటు నేనే రాజు నేనే మంత్రిని మించిన ఇంటెన్సిటీ ఇందులో చూపించబోతున్నట్టు సమాచారం. పడి పడి లేచే మనసు తర్వాత ఆరు నెలలకు పైగా గ్యాప్ తీసుకుని సాయి పల్లవి చేస్తున్న తెలుగు స్ట్రెయిట్ మూవీ ఇదే. రానాతో జోడి కట్టడం కూడా మొదటిసారి. కాంబినేషన్ పరంగా ఇప్పటికే క్రేజ్ తెచ్చేసుకున్న విరాట పర్వం ఎట్టకేలకు మొదలైపోయింది


Tags:    

Similar News