పచ్చని అడవులకు వెళ్లి సినిమా చేయాలంటే సులువే కానీ.. రెడ్ కలర్ ఫారెస్ట్ .. పూర్తిగా ఎండిపోయి జీవం లేని అడవుల్ని వెతికి సినిమా చేయాలంటే అంత సులువైన పనా? పైగా విజువల్ గ్రాఫిక్స్ తో ఎక్కువ పని పడుతుందంటే ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వకుండా ఉంటుందా? ప్రస్తుతం అలాంటి సన్నివేశమే రానా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా `అరణ్య` కి ఎదురైందిట. ఈ సినిమాకి విజువల్ గ్రాఫిక్స్ అవసరం కూడా ఎక్కువే. అందుకే ఇంత ఆలస్యం అని తెలుస్తోంది.
ఎట్టకేలకు ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతోందని రానా వెల్లడించాడు. తెలుగు- తమిళం- హిందీ మూడు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అరణ్య - కాదన్ - హాథీ మేరే సాథీ అనే టైటిల్స్ తో మూడు భాషల్లో సినిమాని రెడీ చేస్తున్నారు. ఇక ఈ మూవీని యూనివర్శల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించేందుకు ప్రభు సోల్మన్ ఎంతో శ్రమించారని రానా చెబుతున్నారు. ష్యూర్ షాట్ గా హిట్ కొట్టే చిత్రాన్ని తనకి అందించనున్నాడన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాడు.
అరణ్య కథాంశం ఆసక్తికరం. ఒక గజరాజు (ఏనుగు)తో ఓ యువకుడి అనుబంధానికి సంబంధించిన కథాంశమిది. దాదాపు ఏడాది పైగానే ఈ సినిమాని చిత్రీకరించారు. అందుకోసం ప్రపంచంలోని రకరకాల అడవుల్ని వెతికి మరీ అక్కడకు వెళ్లి షూట్ చేశారు. ఇది రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు.. పైగా ఏనుగుకు అవసరమైన శిక్షణను ఇచ్చి దాంతో పాటు రానా స్నేహం చేసి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. అందుకోసం రానా చాలానే సాహసాలు చేశారట. ఎట్టకేలకు అన్ని పనుల్ని పూర్తి చేసి ఏప్రిల్ న2న సినిమాని రిలీజ్ చేసేందుకు ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రయత్నాల్లో ఉంది. పక్కా యూనివర్శల్ కాన్సెప్టు తో రూపొందిస్తున్న ఈ సినిమా కి సంబంధించిన రానా లుక్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. రానా రగ్గ్ డ్ లుక్ అభిమానులకు షాకిచ్చింది. కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన రానా మునుముందు మరిన్ని ప్రయోగాత్మక సినిమాలతో దూసుకొస్తున్న సంగతి తెలిసిందే.