అలియా లేక‌పోతే ర‌ణ‌బీర్ బాత్రూమ్ కూడా వెళ్ల‌డా?

Update: 2022-09-21 00:30 GMT


ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ జంట మ‌ధ్య అన్యోన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వివాహానికి ముందే జంట ఎంతో ద‌గ్గ‌రైంది. వివాహ బంధం ఆ  బాండింగ్ ని మ‌రింత బ‌ల‌ప‌రిచింది. రీల్ లైఫ్ లో అయినా..రియ‌ల్ లైఫ్ లో అయినా ఒకేలా ఉంటామ‌ని చాటి చెబుతున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య చోటు చేసుకుంటోన్న స‌ర‌దా సంభాష‌ణ‌లు...గిల్లిక‌జ్జాలు సైతం ఎంతో ఆస‌క్తిక‌రం.

ఒకరిపై ఒక‌రు సెటైర్లు వేసుకుంటారు. ఆ క్ష‌ణ‌మే వాటిని వ‌దిలేస్తారు. స్నేహితులుగా క‌లిసి ఉంటారు. ప్రేమికులుగా ప్రేమ‌ని పంచుకుంటారు. భార్య భ‌ర్త‌లుగా ఉన్న‌తంగాను మెలుగుతారు. ఆ ర‌కంగా  బాలీవుడ్ లో యువ ఆద‌ర్శ దంప‌తులుగా వెలిగిపోతున్నారు. చూడముచ్చ‌టైన  జంట‌ను చూసి అంతా ఎంతో సంతోషిస్తున్న త‌రుణ‌మిది.

వివాహం అనంత‌రం ఇటీవ‌లే `బ్ర‌హ్మ‌స్ర్త` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. శివుడి పాత్రలో ర‌ణ‌బీర్ క‌పూర్- ఇషా చ‌ట‌ర్జీ పాత్ర‌లో అలియాభ‌ట్ ఆద్యంతం ఆక‌ట్టుకున్నారు. ఫాంట‌సీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ లో సైతం అంద‌మైన ప్రేమ‌క‌థ‌ని మ‌లిచిన వైనం ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ని బాగా ఆక‌ట్టుకుంది. తాజాగా ర‌ణ‌బీర్-అలియా ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ను చాటుకునే ప్ర‌య‌త్నం ముచ్చ‌టేస్తుంది.

శివుడు లేక‌పోతే నా పాత్ర అసంపూర్ణంగానే ఉంటుంది.  నిజ జీవితంలో కూడా ఇదే విష‌యాన్ని అలియా చెప్పుకొచ్చింది.  ర‌ణ‌బీర్ సైతం అంతే ప్రేమ‌ని వ్య‌క్తం చేసాడు. ఆలియా ఎక్కడ ఉందో నాకు తెలియకపోతే నేను బాత్రూమ్‌కి వెళ్లను . ఏమీ  తినను కూడా. ఆమె ఎల్లప్పుడు నా క‌ళ్ల ముందుండాలి. త‌ను మాట్లాడ‌క‌పోయినా ప‌ర్వాలేదు...నా క‌ళ్లేదుటే ఉండాలి అని చెప్పుకొచ్చాడు.

ప్ర‌స్తుతం అలియాభ‌ట్ గ‌ర్బవ‌తి అన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో క‌పూర్ ఇంట  వార‌సుడ్ని తీసుకురాబోతుంది. పెళ్లైన ఏడాదే అలియా మామ్ కావ‌డంతో ర‌ణ‌బీర్- అలియా కుటుంబ స‌భ్యులు సంతోషంతో ఉబ్బిత‌బ్బితున్నారు. గ‌ర్భం దాల్చినా అలియా  మీడియాలో  హైలైట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. బ్ర‌హ్మ‌స్ర‌ సినిమా ప్ర‌చారంలో ఎంతో యాక్టివ్ గా పాల్గొంది. ప‌లు టీవీ ఈవెంట్ల‌కు సైతం ఎంతో ఉత్స‌హంతో హ‌బ్బీతో జాయిన్ అయింది. నెల‌లు నిండుతోన్న నేప‌థ్యంలో ఇక‌పై  కొన్ని నెల‌లు పాటు షూటింగ్ ల‌కు దూరంగా ఉండ‌నుంది. ఇంటి ప‌ట్టునే కుటుంబ స‌భ్యుల‌తో కాల‌క్షేపం చేయ‌నుంది.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News